RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. 49 ఎన్బీఎఫ్సీల లైసెన్స్ రద్దు..!

ఆర్థిక విషయాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా దేశంలోని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల (NBFC) రిజిస్ట్రేషన్ల విషయంలో ఆర్బీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. మొత్తం 63 సంస్థలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. వీటిలో 49 ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్లను ఆర్బీఐ స్వయంగా రద్దు చేయగా, మరో 13 ఎన్‌బీఎఫ్‌సీలు, ఒక హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎఫ్‌సీ) తమ రిజిస్ట్రేషన్లను సరెండర్‌ చేసింది. ఇందుకు సంబంధించి నవంబర్‌ 16న ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ చట్టం, 1934లోని సెక్షన్‌ 45-ఐఏ (6) కింద 49 కంపెనీల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను రద్దు చేసినట్లు ప్రకటించింది.

ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు 2026 అక్టోబర్‌ 1 నుంచి 29 మధ్య జారీ అయినట్లు పేర్కొంది. రిజిస్ట్రేషన్లను సరెండర్‌ చేసిన 14 సంస్థల్లో ఆరు కంపెనీలు ఎన్‌బీఎఫ్‌సీ వ్యాపారం నుంచి వైదొలిగినట్లు తెలిపింది. మరో ఐదు సంస్థలు ఆర్బీఐ నిర్దేశించిన నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ అవసరం లేని అన్‌రిజిస్టర్డ్‌ టైప్‌-1 ఎన్‌బీఎఫ్‌సీలుగా వర్గీకరణకు అర్హత సాధించినట్లు పేర్కొంది. మిగిలిన మూడు సంస్థలు విలీనం, రద్దు, స్వచ్ఛందంగా కంపెనీని మూసివేయడం వంటి కారణాలతో చట్టపరమైన ఉనికిని కోల్పోయాయని వివరించింది. రిజిస్ట్రేషన్లను సరెండర్‌ చేసిన సంస్థల్లో మనీష్‌ సింథటిక్స్‌, అమర్‌ ప్లాజా అండ్‌ హోల్డింగ్స్‌, వికానిక్‌ వ్యాపార్‌, రైట్‌ ట్రెజర్‌ ఫైనాన్స్‌ అండ్‌ లీజింగ్‌, బ్రావో క్యాపిటల్‌ సర్వీసెస్‌, సీజీఆర్‌ మర్కంటైల్‌ ఫైనాన్స్‌ ఉన్నాయి.

RBI

అలాగే మనిభవ్నం హోమ్‌ ఫైనాన్స్‌ ఇండియా, సన్‌ సోర్స్‌ లీఫిన్‌, లియానర్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థల రిజిస్ట్రేషన్లను అవి చట్టపరమైన సంస్థలుగా కొనసాగకపోవడంతో రద్దు చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు రద్దయిన సంస్థలు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌ 45-I ప్రకారం ఎన్‌బీఎఫ్‌ఐ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుండదని కేంద్ర బ్యాంక్‌ తెలిపింది. ఆర్‌బీఐ ఏదైనా ఎన్‌బీఎఫ్‌సీ లేదా హెచ్ఎఫ్‌సీ లైసెన్స్ రద్దు చేసినప్పుడు సామాన్య ప్రజలు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.

లైసెన్స్ రద్దయిన ఈ 63 సంస్థలు ఇకపై ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడం గానీ, కొత్తగా ఎలాంటి రుణాలు ఇవ్వడం గానీ చేయకూడదని ఆర్భీఐ స్పష్టం చేసింది. మీరు గతంలో ఈ సంస్థల నుంచి ఏదైనా లోన్ తీసుకుని ఉంటే, లైసెన్స్ రద్దయినంత మాత్రాన మీ అప్పు మాఫీ కాదని గుర్తుంచుకోవాలి. పాత ఒప్పందం ప్రకారం మీరు మీ ఈఎంఐలను సక్రమంగా చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే మీ సిబిల్ స్కోర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుందని గమనించుకోవాలి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+