ప్రభుత్వం మరో ఏడాది పాటు ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతిపై సుంకాన్ని తగ్గించింది. దీంతో ఎడిబుల్ ఆయిల్ ధరలు అదుపులో ఉండే అవకాసం ఉంది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యగా చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఎడిబుల్ ఆయిల్స్ ద్రవ్యోల్బణం పెరగకా పోవచ్చు. శుద్ధి చేసిన సోయాబీన్ నూనె, శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని (ప్రాథమిక దిగుమతి సుంకం) ప్రభుత్వం 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది.
ఈ నిర్ణయం మార్చి 2024 వరకు అమలులో ఉంది. ఇప్పుడు దీన్ని మార్చి 2025 వరకు పొడిగించారు. ఏదైనా వస్తువు ధరను నిర్ణయించడంలో ప్రాథమిక దిగుమతి సుంకం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎడిబుల్ ఆయిల్‌ల దిగుమతిపై ఈ సుంకాన్ని తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్‌లో వాటి ధరలను అదుపులో ఉంచేందుకు చాలా దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. తగ్గించిన దిగుమతి సుంకాన్ని మరో ఏడాది పొడిగిస్తే దేశీయ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరగకపోగా వినియోగదారులకు మేలు జరుగుతుంది.

ప్రపంచంలోనే ఎడిబుల్ ఆయిల్ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. దీంతో పాటు ఎడిబుల్ ఆయిల్ దిగుమతిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశ అవసరాల్లో 60 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. పామాయిల్‌లో ఎక్కువ భాగం ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి అవుతుంది. మస్టర్డ్ ఆయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ భారతదేశంలో ఎక్కువగా వినియోగిస్తారు. నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల్లో అత్యధికంగా పెరిగింది.
ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.70 శాతంగా ఉంది. అంతకు ముందు నెలలో ఇది 6.61 శాతంగా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ డేటా ప్రకారం, వార్షిక ప్రాతిపదికన పప్పుల ధరలు 10.27 శాతం, కూరగాయల ధరలు 17.7 శాతం పెరిగాయి.


Click it and Unblock the Notifications