Gold Bonds: బంగారం బాండ్లపై భారీ రాబడి.. రూ.లక్ష పెడితే రూ.3.72 లక్షలు వచ్చే.. అదీ ఐదేళ్లలో..
బంగారం ధర గత రెండేళ్లలో భారీగా పెరిగింది. బంగారంలో ఐదారేళ్ల క్రితం పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలు వచ్చాయి. అయితే అప్పుట్లో ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్ల(Sovereign Gold Bonds)ను తీసుకొచ్చింది. అప్పట్లో పసిడి ధర చాలా తక్కువగా ఉండేది. దీంతో చాలా మంది సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టారు. అప్పుడు పెట్టుబడి పెట్టిన వారిపై ఇప్పుడు కనక వర్షం కురుస్తోంది. పుత్తడి ధర భారీగా పెరగడంతో వారికా భారీగా లాభాలు వచ్చాయి. అయితే సావరిన్ గోల్డ్ బాండ్లకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఈ సార్వబౌమ బంగారు బాండ్లకు 8 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ విధించారు.
అంటే ఒక్కసారి ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు కొంటే 8 సంవత్సరాల తర్వాతే మీరు డబ్బులు వెనక్కు తీసుకువచ్చు. అయితే ఆర్బీఐ ప్రీ మెచ్యూర్ రిడంప్షన్ అవకాశం కల్పించింది. ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన రెండు సీరిస్ ల సావరిన్ గోల్డ్ బాండ్లకు ఆర్బీఐ ప్రీ మెచ్యూర్ అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి ఆగస్ట్ 11న ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. 2020 ఫిబ్రవరి 11వ తేదీన జారీ చేసిన 2019-20 సిరీస్ IX సావరిన్ గోల్డ్ బాండ్లు, 2020, జులైలో జారీ చేసిన 2020-21 సిరీస్ V సావెరిన్ గోల్డ్ బాండ్లకు ప్రీ మెచ్యూర్ అవకాశం కల్పించింది. ఈ బాండ్లు ఉన్నవారు డబ్బును వెనక్కి తీసుకోవచ్చు.

సిరీస్ IX సావరిన్ గోల్డ్ బాండ్లకు సంబంధించి అప్పుడు బంగారం గ్రాముకు రూ.4020 చొప్పున బాండ్లు కేటాయించారు. ఆన్ లైన్ కొనుగోలు చేసిన వారికి రూ.4020 పడగా.. ఆఫ్ లైన్ కొనుగోలు చేసిన వారికి బంగారం గ్రాము రూ.4070 పడింది. వీరికి ప్రీ మెచ్యూర్ లో భాగంగా ఆగస్టు 6,7, 10, 2026 రోజుల్లోనే బంగారం ధరల సగటు ఆధారంగా గ్రాముకు రూ.14,957గా నిర్ణయించారు. వీరు గ్రాముకు రూ.4020 చెల్లిస్తే.. వచ్చేది రూ.14,957 అంటే ఐదేళ్లలో వీరికి గ్రాముపై రూ.10,937 లాభం వస్తుంది. వీరికి దాదాపు 272 శాతం లాభం వచ్చింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.3.72 లక్షల రానున్నాయి.
సిరీస్ V సావెరిన్ గోల్డ్ బాండ్లకు సంబంధించి అప్పుడు బంగారం గ్రాముకు రూ.5284 చొప్పున బాండ్లు కేటాయించారు. వీరికి ప్రీమెచ్యూర్ రిడంప్షన్ ధరను ఆగస్టు 6, 7,10, 2026 తేదీల్లోని సగటు ధర ఆధారంగా రూ. 14,957గా నిర్ణయించారు. వీరికి ఒక్కో గ్రాముపై రూ.9,673 లాభం వచ్చింది. అంటే దాదాపు 183 శాతం లాభం వచ్చింది. ఇందులో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే వారికి రూ.2.83 లక్షలు వచ్చేవి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications