RBI: లోన్లు తీసుకున్నవారికి శుభవార్త చెప్పిన ఆర్బీఐ..!

రుణాలు తీసుకున్నవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. రికవరీ పేరుతో లోన్ తీసుకున్న వ్యక్తి మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్‌ను రిమోట్‌గా బ్లాక్ చేయడం, వాటి ఫీచర్లను నిలిపివేయడంపై ఆర్బీఐ కీలక ఆంక్షలు విధించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆ పరికరాన్ని కొనుగోలు చేయడానికి ఇచ్చిన లోన్ అయితే మాత్రమే బ్యాంకులు, లోన్ సంస్థలు డివైస్ రిస్ట్రిక్షన్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. మీరు ఈఎంఐలో ఫోన్ కొనుగోలు చేస్తే దాన్ని ఈఎంఐ చెల్లించుకుంటే మీ ఫోన్ స్వాధీనం చేసుకోవచ్చు. అయితే పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, ఇతర లోన్ బకాయిల పేరుతో రుణగ్రహీత మొబైల్ ల్యాప్‌టాప్‌లను రిమోట్‌గా బ్లాక్ చేయడానికి అనుమతి ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

లోన్ అగ్రిమెంట్ లో డివైస్‌పై ఆంక్షలు విధించే అవకాశం గురించి స్పష్టంగా పేర్కొని ఉండాలని ఆర్బీఐ పేర్కొంది. అలాగే రుణగ్రహీతకు ముందుగానే నోటీసు ఇచ్చి.. ఎలాంటి పరిమితులు విధిస్తారో వివరించాలని తెలిపింది. లోన్ గడువు దాటి 30 రోజులు పూర్తయ్యే వరకు ఎలాంటి ఫీచర్‌ను కూడా నిలిపివేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. 30 రోజుల తర్వాత కూడా వెంటనే మొత్తం డివైస్‌ను బ్లాక్ చేయకుండా.. అవసరం లేని కొన్ని ఫీచర్లను మాత్రమే దశలవారీగా రిస్ట్రిక్ట్ చేయాలని తెలిపింది.

RBI

లోన్ 60 రోజులు బకాయి అయిన తర్వాత మాత్రమే ఒప్పందంలో పేర్కొన్న పూర్తి స్థాయి పరిమితులను అమలు చేయవచ్చని వివరిచింది. అయితే 60 రోజుల గడువు పూర్తయ్యే వరకు అవుట్‌గోయింగ్ కాల్స్‌ను కూడా ఆపటానికి వీల్లేదని స్పష్టం చేసింది. రుణగ్రహీతల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక రక్షణలు చర్యలు తీసుకుంది. ఇన్‌కమింగ్ కాల్స్, SMSలు, అత్యవసర SOS సేవలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదని స్పష్టం చేసింది. అలాగే ఉద్యోగానికి అవసరమైన విధంగా పరికరాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని కూడా బ్యాంకులు అడ్డుకోకూడదని వివరించింది.

రుణగ్రహీత బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాత ఒక గంటలోపు డివైస్‌పై విధించిన అన్ని పరిమితులను తొలగించాల్సిందేనని తెలిపింది. ఒకవేళ బ్యాంకు తప్పుగా డివైస్‌ను బ్లాక్ చేసినా.. డబ్బు చెల్లించిన తర్వాత కూడా ఆలస్యంగా అన్‌లాక్ చేసినా, ప్రతి గంట ఆలస్యానికి రూ.250 చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కాగా రుణాలు తీసుకున్న వారిని వేధించకూడదని గతంలోనే ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+