Gold Loan: బంగారం రుణాలు తీసుకునే వారికి షాక్.. ఇకపై వ్యవసాయం కోసం గోల్డ్ లోన్ తీసుకోలేరా..!
గోల్డ్ లోన్ తీసుకునేవారికి ఆర్బీఐ షాక్ ఇచ్చింది. తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ నిబంధనలలో కీలక మార్పులు చేస్తూ నవంబర్ 5న తాజా ముసాయిదా విడుదల చేసింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలకు సంబంధించి కీలక అంశాలు అందులో ఉన్నాయి. ముఖ్యంగా బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే వ్యవసాయ గోల్డ్ లోన్లపై ఆర్బీఐ రూల్స్ మరింత కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. గతంలో రైతులు పసిడిని తనఖా పెట్టి సులభంగా వ్యవసాయ లోన్ తీసుకునేవారు. తాజా నిబంధనల ప్రకారం కేవలం బంగారం విలువను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని లోన్ మంజూరు చేయడం కురదని తెలుస్తోంది.
వ్యవసాయ కార్యకలాపాల వాస్తవ అవసరాలు, భూమి వివరాలు, పండించే పంటలు వంటి అంశాలను బ్యాంకులు క్షుణ్ణంగా పరిశీలించాల్సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. బంగారం ఆభరణాలను తాకట్టు పెట్టినంత మాత్రాన ఆ అగ్రి లోన్స్ పీఎస్ఎల్ ప్రయోజనాలకు అనర్హత కాదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. అగ్రి గోల్డ్ లోన్ నిబంధనలు కఠినంగా మారడంతో బ్యాంకుల పరిశీలన విధానం పూర్తిగా మారే అవకాశం ఉంది. బ్యాంకులు ఇక నుంచి రైతులు నింజంగానే భూమి సాగు చేస్తున్నారా. సాగు చేసే భూమి ఎక్కడ ఉంది? ఏ పంటలు సాగు చేస్తున్నారు? వంటి పూర్తి వివరాలు పరిశీలించనున్నారు.

వ్యవసాయం కోసం గోల్డ్ తీసుకున్నవారు.. తీసుకున్న అప్పును సక్రమంగా వాడుతున్నారా లేదా అని పరిశీలించడానికి బ్యాంక్ అధికారులు నేరుగా పొలాలను సందర్శించి రికార్డులు నిర్వహించాలని ఆర్బీఐ పేర్కొంది. ఒకవేళ భూమి రికార్డులు లేని కౌలు రైతులు లేదా భూమిలేని వ్యవసాయ కూలీలు అయితే.. వారి అర్హతను నిరూపించేందుకు ప్రత్యామ్నాయ ధ్రువపత్రాలను సమర్పించాలి. ఈ కొత్త నిబంధనల ద్వారా అగ్రికల్చర్ లోన్స్ పేరుతో జరిగే అవకతవకలకు, నిధుల మళ్లింపునకు చెక్ పెట్టాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు రైతులకు గతంలో మాదిరిగానే కొనసాగుతుంది. డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ ప్రక్రియ మాత్రం ఇకపై మరింత కఠినంగా కానుంది. దీనివల్ల నిజమైన రైతులకు మాత్రమే బ్యాంకింగ్ రంగం నుంచి సకాలంలో సాయం అందే అవకాశం ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications