RBI: మీ దగ్గర ఇప్పటికీ రూ.2 వేల నోట్లు ఉన్నాయా.. అయితే ఈ పని చేయండి..!
చాలా మందికి ఒక డౌట్ ఉంది. ప్రస్తుతం ఎక్కడా రూ.2000 నోటు కనిపించడం లేదు. దీంతో ఈ నోటు చలామణీలో ఉందో లేదో తెలియడం లేదు. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై కీలక ప్రకటన చేసింది. రూ.2000 నోట్లు ఇప్పటికీ కూడా చెల్లుబాటులోనే ఉన్నాయని ప్రకటించింది. ప్రజల వద్ద ఈ నోట్లు ఉంటే వీలైనంత త్వరగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని కోరింది. 2 వేల నోట్లు బ్యాంకులో జమ చేసి రూ.500 నోట్లు లేక మిగతా నోట్లు తీసుకోవచ్చని తెలిపింది. ఇప్పటి వరకు ఎక్కువ శాతం రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని ఆర్బీఐ పేర్కొంది. అయితే ఇప్పటికీ కొన్ని రూ.2000 కరెన్సీ నోట్లు చలామణీలో ఉన్నాయని గుర్తు చేసింది.

అయితే ప్రస్తుతం సాధారణ బ్యాంక్ బ్రాంచ్ల్లో రూ.2 వేల నోట్లు మార్చుకునే అవకాశం లేదు. ఈ నోట్లను మార్చుకోకవాలంటే.. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఇండియాకు సంబంధించిన కార్యాలయాల్లో మార్చుకోవాలి. దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో మాత్రమే రూ.2000 నోట్లు మార్చుకునే అవకాశం ఉంది. ఒక వేళ మీకు సమీపంలో ఆర్బీఐ ఆఫీస్ లేకపోతే పోస్టల్ ద్వార్ మీ సమీపంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసుకు నోట్లను పంపించాలని ఆర్బీఐ కోరింది. ఫోస్ట్ ద్వార్ రూ.2000 వేల నోట్లు పంపేవారు కొన్ని వివరాలు జత చేయాలి.
మీరు రూ.2 వేల నోట్లతో పాటు బ్యాంక్ ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఖాతాదారుడి పేరు, ఫోన్ నంబర్ వంటి వివరాలు తప్పకుండా సమర్పించాలి. అన్ని వివరాలు సరిగా ఉంటే.. మీరు పంపించిన రూ.2000 నోట్లకు విలువైన మొత్తాన్ని మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఒకవేళ డబ్బు జమ కావడంలో ఆలస్యమైతే ఆర్బీఐని సంప్రదించాలని కోరారు. కాగా దేశంలో నోట్ల రద్దు తర్వాత రూ.2 వేల నోట్లను తీసుకొచ్చింది. ఆ తర్వాత క్రమంగా ఈ నోట్ల ముద్రణ నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే 2023 నుంచి రూ.2 వేల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
అయితే ఇప్పటికీ ఆ నోట్లను ఆర్బీఐ చెల్లని కరెన్సీగా ప్రకటించలేదు. అందుకే అవి ఇప్పటికీ లీగల్ టెండర్‌గానే కొనసాగుతున్నాయని చెబుతున్నారు. అంటే RBI వాటిని స్వీకరిస్తూనే ఉంటుందని. అయినప్పటికీ చివరి నిమిషం వరకు వేచి చూడకుండా.. మీ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను వీలైనంత త్వరగా డిపాజిట్ చేయడం మంచిది. భవిష్యత్ లో రూ.2000 నోట్లను పూర్తిగా ఉపసంహరించుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications