The Raja Saab in North America: అమెరికాలో రాజా సాబ్ మూవీ టికెట్ రేట్లు.. ప్రభాస్ మూవీ ప్రీమియర్లకు ధర ఎంతంటే?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్‌తో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ పలని సినిమాటోగ్రాఫర్‌గా, ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 9వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? నార్త్ అమెరికాలో బిజినెస్ ఎంత? అమెరికా, కెనడాలో టికెట్ రేట్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

ది రాజా సాబ్ చిత్రాన్ని సుమారుగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న ది రాజా సాబ్ చిత్రాన్ని నార్త్ అమెరికాలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యాంగీరా సినిమాస్ రిలీజ్ చేస్తున్నది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను సుమారుగా 9 మిలియన్ డాలర్లు చెల్లించి ప్రత్యాంగీరా సినిమాస్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 18 మిలియన్ డాలర్లు అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్ 40 రోజుల ముందే ప్రారంభించారు. ఈ సినిమా టికెట్ రేట్లపై ప్రత్యాంగీరా సినిమాస్ అధికారికంగా ప్రకటన చేశారు. ప్రీమియర్ల అడ్వాన్స్ బుకింగ్ మాత్రమే ప్రారంభమైంది. కానీ ఈ సినిమా తొలివారం టికెట్ రేట్లను అధికారికంగా ప్రకటిస్తున్నామని తెలిపింది.
ది రాజా సాబ్ టికెట్ రేట్ల విషయానకిి వస్తే.. జనవరి 8వ తేదీన ప్రదర్శించే ప్రీమియర్లకు టికెట్ ఒక్కంటికి 20 డాలర్లు గానీ, 25 డాలర్లు గానీ ఉంటుంది. ఇక జనవరి 9 నుంచి 11వ తేదీ వరకు ప్రదర్శించే ఆటలకు 18 డాలర్లు గానీ 20 డాలర్లుగానీ టికెట్ రేట్ ఉంటుంది. ఇక జనవరి 12 నుంచి 14వ తేదీ వరకు ప్రదర్శించే షోలకు 14 డాలర్లు గానీ, 17 డాలర్లుగానీ ఉంటాయి. జనవరి 15వ తేదీ నుంచి ప్రదర్శించే ఆటలకు థియేటర్ నిర్ణయించే ప్రమాణిక రేట్లు అందుబాటులో ఉంటాయి అని స్పష్టమైన వివరాలను ప్రత్యాంగీరా సినిమాస్ అందించింది.
ది రాజా సాబ్ స్పెషల్ ఫార్మాట్స్ విషయంలో థియేటర్ల నిబంధనలు, సినిమా స్కేల్ ప్రకారం అదనపు సర్‌ఛార్జిలు ఉంటాయి. ఈ నిబంధనలు, టికెట్ రేట్లు కేవలం తెలుగు వెర్షన్‌కు మాత్రమే వర్తిస్తాయి అని ప్రత్యాంగీరా సినిమాస్ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications