పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ చిత్రం రాజాసాబ్ (Raja saab) బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతోంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చి అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరడానికి సిద్ధంగా ఉండటం విశేషం.

ప్రభాస్ తన కెరీర్‌లో మొదటిసారి హారర్ కామెడీ జోనర్‌లో చేసిన ప్రయోగం రాజాసాబ్ (Raja saab). ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండే రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తోంది. తొలిరోజే ఈ చిత్రం దేశవ్యాప్తంగా సుమారు రూ.53.75 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. రెండో రోజు రూ.27.83 కోట్లు, మూడో రోజు ఆదివారం కావడంతో దాదాపు రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు అంచనా. దీనితో కేవలం మూడు రోజుల్లోనే భారతీయ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ.91.25 కోట్ల మార్కును చేరుకున్నాయి.
వరల్డ్‌వైడ్ కలెక్షన్ల రికార్డు
ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. రాజాసాబ్ (Raja saab) ఇప్పటికే రూ.135 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో ముఖ్యంగా అమెరికా, జపాన్‌లలో ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది. ఒక హారర్ కామెడీ చిత్రానికి ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం భారతీయ సినిమా చరిత్రలో ఇదే ప్రథమం. ప్రభాస్ తన కెరీర్‌లో వరుసగా ఆరోసారి రూ.100 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ఏకైక భారతీయ హీరోగా చరిత్ర సృష్టించారు.
రెస్పాన్స్ ఓకే..
డైరెక్టర్ మారుతి కామెడీతో పాటు హారర్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, జరీనా వాహబ్ ప్రభాస్ తాతామ్మలుగా నటించగా, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా అలరించారు. థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు అతిపెద్ద బలం. ముఖ్యంగా సెకండాఫ్, క్లైమాక్స్ సన్నివేశాలకు కొన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఓటీటీ అంచనాలు
రాజా సాబ్ (Raja saab) డిజిటల్ రైట్స్ గురించి కూడా ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'Jio Hotstar' దాదాపు రూ.160 కోట్లకు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన 45 రోజుల తర్వాత.. అంటే ఫిబ్రవరి నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
మొత్తానికి ఈ సినిమా మిక్స్‌డ్ రివ్యూలను అందుకుంటున్నా.. ప్రభాస్ మేనియా మాత్రం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ఈ సంక్రాంతి సీజన్ ముగిసే సమయానికి రాజా సాబ్ మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications