AP News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో వందే భారత్ ట్రైన్..!
రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీకి మరో వందే భారత్ రైలు రాబోతోంది. కేంద్ర రైల్వే శాఖకు ఏపీ సీఎం నుంచి పలువురు ఎంపీల ప్రతిపాదనల మేరకు వందే భారత్ రైలు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ వందే భారత్ టైన్ విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య నడవనుంది. విశాఖ నుంచి పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఈ రైలు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. విశాఖ నుంచి ప్రస్తుతం నాలుగు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య రెండు, భువనేశ్వర్‌కు ఒకటి, దుర్గ్‌కు మరొకటి నడుస్తున్నాయి.
తిరుపతి, బెంగళూరు నగరాలకు కూడా విశాఖ నుంచి వందేభారత్ రైళ్లు నడపాలని సీఎం చంద్రబాబుతో సహా పలువురు ఎంపీలు రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులుగా విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ కేటాయింపు పైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రైలుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో డే టైమింగ్స్ లో విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చింది రైల్వే. వచ్చే ఏడాదిలో విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు రాత్రి వేళల్లో వందేభారత్ స్లీపర్ నడిచే అవకాశం కనిపిస్తోంది.

విశాఖ నుంచి తిరుపతి వందేభారత్ రైలు హాల్టింగ్ స్టేషన్లతో పాటుగా టైమింగ్స్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పలు నివేదికల ప్రకారం ఈ వందే భారత్ విశాఖలో స్టార్ట్ అయి సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్ల ఆగే అవకాశం ఉంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి ఉదయం 5.35 గంటలకు బయల్దేరి 7 గంటలకు సామర్లకోట, 7.40 గంటలకు రాజమండ్రి, 9.30 గంటలకు విజయవాడ, 10.55 గంటలకు ఒంగోలు, 12.15 గంటలకు నెల్లూరు మీదుగా మధ్యాహ్నం 2.10 గంటలకు తిరుపతి చేరుకునే అవకాశం ఉంది.
తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.55 గంటలకు తిరుపతిలో బయల్దేరి సాయంత్రం 4.48 గంటలకు నెల్లూరు, 6.08 గంటలకు ఒంగోలు, రాత్రి 7.25 గంటలకు విజయవాడ, 9.23 గంటలకు రాజమండ్రి, 10.03 గంటలకు సామర్లకోట మీదుగా రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నానికి చేరుకోనుంది. కాగా ఏపీ నుంచి ఇప్పటికే ఒక వందే భారత్ స్లీపర్ ట్రైన్ నడుస్తోంది. ముంబై, బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ ఏపీలోని అనంతపురం, గుంతకల్లు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications