PM Narendra Modi: బంగారం ధరపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. మాట విన్నారు డబ్బు ఆదా చేశారు..

బంగారం ధరల తగ్గుదలపై ప్రధాన నరేంద్ర మోదీ స్పందించారు. అవసరం లేకపోతే ఏడాది పాటు బంగారం కొనొద్దని తాను ఇచ్చిన పిలుపును ఆయన గుర్తుచేశారు. తన సలహా పాటించడం వల్లే ప్రజల డబ్బు ఆదా అయిందని పేర్కొన్నారు. శనివారం లక్నోలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగించారు. అవసరం లేకపోతే ఏడాది పాటు బంగారం కొనొద్దని దేశ ప్రజలను కోరానని చెప్పారు. తనలాంటి సామాన్యుడు అడిగితే ప్రజలు బంగారం తక్కువ కొనుగోలు చేశారు. ధరలు తగ్గాయని తెలిపారు. "మోదీ జీ.. మీరు చెప్పారు, మేం విన్నాం, మా డబ్బు మిగిలిందని ఇప్పుడు ప్రజలు నాతో అంటున్నారు" అని వివరించారు.

1960ల్లో ఒక పూట భోజనం మానేయాలని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన పిలుపును దేశం పాటించినట్లే, ఇప్పుడూ దేశ ప్రజలు అదే చొరవ చూపారని గుర్తు చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తత ప్రారంభం అయిన తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. అప్పుడే బంగారం ధరలు కూడా పెరిగాయి. దీంతో దేశ ఆర్థిక స్థితి పై నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ మారక నిల్వలు పడిపోతున్న క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచన చేశారు. ప్రజలు ఇంధనాన్ని పొదుపుగా వాడాలని.. అవసరం ఉంటే తప్ప బంగారం కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుకు చాలా చాలా మంది స్పందించారు.

Narendra Modi

బంగారం ధరలు తగ్గడంతో ఆయన సలహా పాటించడం మంచిది అయిందని పేర్కొంటున్నారు. కాగా.. వరుసగా ఐదు రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ వారంలో సుమారు 9 శాతం పడిపోయాయి. ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 25 వేల 080 వద్ద కొనసాగుతోంది. తులం 22 క్యారెట్ల పుత్తడి ధర 1, 14, 650 కు చేరింది. బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముడి చమురు ధర పెరుగుతున్న వేళ కేంద్రం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. సెప్టెంబర్ 1న ఓ వీడియో సందేశంలోనూ అవసరం లేకపోతే బంగారం కొనొద్దని మోదీ మళ్లీ కోరారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+