Tomato Price: భారీగా పతనమైన టమాటా ధరలు.. కిలో రూ.5 రూపాయలే..!
నెలన్నర క్రితం భారీగా పెరిగిన టమాటా ధరలు, టమాటా దొంగతనం, టమాటా రైత హత్య ఇలా అనేక వార్తలు చూశాం. ఎందుకంటే అప్పుడు టమాటా ధర ఆకాశాన్ని అంటాయి. నెలన్నర క్రితం కిలో టమాటా రూ.250 నుంచి రూ.300 పలికింది. దీంతో చాలా మంది టమాటాలు తినడం మానేశారు. రెస్టారెట్లు టమాటా వినియోగాన్ని తగ్గించేశాయి. ఆ సమయంలో టమాటా పండించిన రైతులకు బాగానే డబ్బులు వచ్చాయి.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఓడలు బండ్లయినట్లుగా.. రూ.300 లకు కిలో పలికిన టమాటా ఇప్పుడు రూ.5 కిలో పలుకుతోంది. దీంతో టమాటా పండించిన రైతులు లబోదిబోమంటున్నారు. టమాటా ధర అమంతం పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం టమాటా కొనేవారు లేక అన్నదాతలు టమాటాలు పారబోస్తున్నారు. పండించిన పంట మార్కెట్ తీసుకొచ్చి అమ్మితే రైతులకు రవాణా చార్జీలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్లలో టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. 25 కిలో బాక్స్ రూ.100 పలుకుతోంది. అంటే కేజీ రూ.4 పలుకుతోంది. దీంతో రైతులు టమాటాలను మార్కెట్ తీసుకొచ్చే బదులుగా పారబోస్తున్నారు. ఇన్ని టమాటా కొనడానికి భయపడిన జనం ఇప్పుడు కిలోల్లో కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉండడంతో టమాటా ధరలు పడిపోతున్నట్లు కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.
మరో పక్క ఉల్లి ధరలు పెరుగుతోన్నాయి. కిలో ఉల్లి రూ.40 నుంచి 60 వరకు పలుకుతోంది. కేంద్రం ఉల్లి ధరల తగ్గించేందుకు ఇప్పటికే ఉల్లి ఎగుమతిపై సుంకాన్ని విధించింది. అందుకు ముందు బియ్యం ధరల తగ్గేంచేందుకు బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది.


Click it and Unblock the Notifications