ప్రపంచవ్యాప్త ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతోంది. బియ్యం, పప్పు, కూరగాయలు ఇలా ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతంది. భారత్ లో కూడా జులైలో ఆహార ద్రవ్యల్బణం పెరిగింది. దీంతో ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా బియ్యం ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్రం ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమగమతి పై నిషేధం విధించింది. గత కొద్ది రోజులుగా భారత్ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడం ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది. చాలా దేశాల్లో బియ్యం ధరలు భారీగా పెరిగాయి.
గత వారంలో భారత్ పారాబాయిల్డ్, బాస్మతి బియ్యంపై మరిన్ని ఆంక్షలు విధించింది. బుధవారం ఆసియాలో బియ్యం ధరలను 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. బియ్యంతో పాటు మరికొన్ని ధాన్యాలపై నిషేధం జూలై 20 నుంచి ప్రారంభమైంది. దీని తరువాత అనేక రకాల బియ్యం ఎగుమతిపై నిషేధం విధించారు. ప్రపంచంలోనే బియ్యం ఎగుమతి చేసే దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. ఇండియా తర్వాత తరువాత థాయిలాండ్, వియత్నాం వంటి దేశాలు ఉన్నాయి.

బియ్యం ధరల పెరుగుదల తరచుగా పేద వినియోగదారులను ఎక్కువగా దెబ్బతీస్తుందని హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎమెరిటస్ పీటర్ టిమ్మర్ అన్నారు. ప్రస్తుతం భారత్ తో పాటుగా థాయ్‌లాండ్, వియత్నాం ఆంక్షలు విధిస్తే ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధర 1000 డాలర్లు దాటే అవకాశం ఉందని ఆయన అన్నారు. గ్లోబల్ మార్కెట్‌లో బియ్యం బెంచ్‌మార్క్ ధర ప్రస్తుతం టన్నుకు $ 646గా ఉంది. బియ్యం ధర మరింత పెరగవచ్చని భావిస్తున్నరాు. థాయ్‌లాండ్ తమ దేశంలో ఈసారి కరవును వచ్చే అవకాశం ఉంది హెచ్చరించింది.
దీని కారణంగా ప్రపంచ మార్కెట్‌లో బియ్యం ధర పెరిగే అవకాశం మరింత పెరిగింది. ప్రస్తుతం చైనాలో పంట బాగా పండింది. ప్రపంచం ఇక్కడ నుంచి ఉపశమనం పొందవచ్చు. దేశంలో బియ్యం ధర గత సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ ధరకు అమ్ముడవుతోన్నాయి. న్యూఢిల్లీలో కిలో బియ్యం ధర రూ.39. అటువంటి పరిస్థితిలో, పెరుగుతున్న బియ్యం ధర కారణంగా ఎగుమతి సుంకం పెంచారు.


Click it and Unblock the Notifications