పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నేడు (గురువారం, మే 2022) కూడా స్థిరంగా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ డ్యూటీ అంతకుముందు వారం తగ్గించింది. దీంతో వాహనదారులకు భారీ ఊరట కలిగింది. గత దీపావళి సమయంలో పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా రెండోసారి అంతకు రెండింతలు తగ్గించింది. కేంద్రం బాటలో రాష్ట్రాలు కూడా నడిస్తే వాహనదారులకు మరింత ఊరట కలుగుతుంది. అయితే అంతర్జాతీయంగా మాత్రం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతవారం ప్రారంభంలో 110 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ఇప్పుడు 120 డాలర్లకు చేరుకుంది.
కేంద్రం తగ్గింపును పక్కన పెడితే చమురు మార్కెటింగ్ సంస్థల పెట్రోల్, డీజిల్ ధరలు నేడు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. మోడీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నేపథ్యంలో నిన్న డీజిల్ ధర రూ.105.49 నుండి రూ.97.82కు తగ్గింది. నేడు యథాతథంగా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 నుండి రూ.96.72, డీజిల్ రూ.96.67 నుండి రూ.89.62కు పడిపోయింది. ముంబైలో పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.97.28, చెన్నైలో పెట్రోల్ రూ.102.65, డీజిల్ రూ.94.24, కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76, బెంగళూరులో పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89, గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.97.81, డీజిల్ రూ.90.05గా ఉంది.

దేశీయ చమురు రంగ సంస్థలు చివరిసారి 6, ఏప్రిల్ రోజున లీటర్ పెట్రోల్ పైన పెంపును అమలు చేశాయి. మార్చి 22వ తేదీ నుండి పక్షం రోజుల పాటు మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఆ తర్వాత స్థిరంగా నెలకు పైగా స్థిరంగా ఉంది. అంతకుముందు నవంబర్ 4వ తేదీ నుండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. నాలుగున్నర నెలల పాటు స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ వరకు స్థిరంగానే కొనసాగాయి. ఆ తర్వాత పది రోజుల పాటు సవరించారు. తిరిగి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కేంద్రం భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి వాహనదారులకు ఊరటను కల్పించింది.
More From GoodReturns

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications