పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. అయితే ఇది మన దేశంలో కాదు. పొరుగు దేశం పాకిస్థాన్ లో. అవును పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించింది. దీంతో అక్కడ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. పాక్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ ధరపై రూ.15.39 తగ్గించింది. డీజిల్ పై లీటరుకు రూ.7.88 తగ్గించింది. ప్రస్తుతం పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.273 గా ఉంది. డీజిల్ లీటరుకు రూ.274 గా ఉంది.
గత 15 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పడుతున్నాయని పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందుకే పెట్రోల్, డీజిల్ తగ్గించినట్లు తెలిపింది. గత 15 రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ రేటు బ్యారెల్‌కు $ 8.7, డీజిల్ రేటు $ 4.3 తగ్గింది. దీంతో పాకిస్థాతాన్‌లో ధరలు తగ్గాయి. గత 15 రోజుల్లో పెట్రోల్‌పై దిగుమతి ప్రీమియం బ్యారెల్‌కు ఏడు శాతంపైగా పెరిగి 10.30 డాలర్లకు చేరుకుంది.

పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, హెచ్‌ఎస్‌డిపై లీటరుకు రూ.60 పెట్రోలియం డెవలప్‌మెంట్ లెవీ (పిడిఎల్) వసూలు చేస్తోంది. మార్చి 31తో ముగిసిన మొదటి తొమ్మిది నెలల్లో ఇక్కడ రూ.720 బిలియన్లు డిపాజిట్ అయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి నిబంధనల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం లెవీగా రూ. 869 బిలియన్లను వసూలు చేయాలని పాక్ ప్రభుత్వం బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది.
అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నప్పటికీ భారత్ లో మాత్రం పెట్రోల్, డీజిల్ తగ్గడం లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గితే దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications