బంగారం ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. కొద్దు రోజులు తగ్గుతోంది. మరి కొద్ది రోజులు పెరుగుతోంది. అయితే తగ్గడం కంటే త్వరగా పెరుగుతోంది. తాజాగా పుత్తడి ధర రూ.270 పెరిగింది. శనివారం కూడా బంగారం ధర పెరిగింది. శని, సోమవారాల్లో రూ.490 పెరిగింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,670 లుగా ఉంది. అంటే గ్రాము పుత్తడి రేటు 6,267 గా ఉంది.
ఇక 22 క్యారెంట్ల బంగారం ధర 10 గ్రాములకు 250 పెరిగి రూ.57,450 కి చేరింది. ఇక వెండి ధర కూడా భారీగానే పెరిగింది. వెడి కిలో రూ.500 పెరిగింది. కిలో వెండి ధర రూ. 77,500 గా ఉంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో పుత్తడి ధర పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,670 గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.57,450 గా ఉంది.

విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెంట్ల బంగారం ధర రూ.62,670 గా ఉంది. కరీంనగర్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 62,670 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.63,270 గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల పుత్తతడి ధర రూ.62,820 గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,670 గా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.77,500 గా ఉంది.


Click it and Unblock the Notifications