బంగారం ప్రియులకు శుభవార్త గురువారం దేశంలో బంగారం ధర తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,170 గా ఉంది. అదే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,590. కాగా బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,880 నిన్నటితో పోల్చితే రూ.710 తగ్గింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,310 గా ఉంది.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,150. విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,310 . కరీంనగర్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.62,310 . ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,140 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,300 కొనసాగుతోంది. కోల్ కత్తాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,170 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 57,490 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,720గా కొనసాగుతోంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. బుధవారం వెండి ధర కిలోకు రూ.1500 తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి రూ. 1500 తగ్గి కేజీకి రూ. 74 వేలు పలుకుతోంది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 76,900 చేరింది. కోల్ కతాలో రూ. 75,400 లుగా ఉంది.
ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్లు, డిమాండ్ పై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. ఉదయం సెషన్‌లలో బంగారం, వెండి రెండు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే డాలర్ ఇండెక్స్‌లో శీతలీకరణ కారణంగా రోజువారీ కనిష్ట స్థాయిల నుంచి పుంజుకుంది.


Click it and Unblock the Notifications