Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇక కొనలేమా..!
మంగళవారం మరోసారి బంగారం ధర పెరిగింది. సోమవారం కూడా పుత్తడి రేటు పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,930 గా ఉంది. అంటే దాదాపు రూ.73 వేలకు చేరువలో ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,850 గా ఉంది. హైదరాబాద్, కరీంనగర్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,930 ఉండగా.. అదే 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 66,850 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,900 గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల స్వర్ణం ధర రూ. 66,800 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర 200 రూపాయలు పెరిగి 67,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 220 రూపాయలు పెరిగి రూ. 73,530 గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,080 గా ఉంది. ఇక 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.67000 గా ఉంది.

కోల్ కతా, బెంగళూరులో 24 క్యారెట్ల 10గ్రాముల పుత్తడి ధర రూ. 72,930. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.66,850 గా ఉంది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో రూ.3500 పెరిగి రూ.96500 లకు చేరింది. హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ లో కిలో వెంటి రూ.1,01,000 గా ఉంది. ముంబై, ఢిల్లీలో కిలో వెండి రూ.96,500 గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.1,01,000 గా ఉంది. నగరాన్ని బట్టి బంగారం, వెండి ధరలు మారుతుంటాయి.


Click it and Unblock the Notifications