Garlic: కొండెక్కిన వెల్లుల్లి ధర.. కొనటం కష్టమే..!
వెల్లుల్లి ధర కొండెక్కి కూర్చుంది. ధరలు భారీగా పెరగడంతో కొనుగోలు చేయడానికి సామాన్యులు జంకుతున్నారు. వెల్లుల్లి కిలో రూ.450 నుంచి రూ.550 వరకు పలుకుతోంది. దీంతో కర్రీలో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేయడానికే భయపడుతున్నారు. మరోవైపు వెల్లుల్లి పంట వేసిన రైతులు వెల్లుల్లిని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని ఛింద్వాడా జిల్లా మోహ్ ఖేడ్ గ్రామంలో వెల్లుల్లి చోరీలు జరుగుతోన్నాయి.
దీంతో రైతులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత వెల్లుల్లి దొంగతనాలు ఆగిపోయాయని రైతులు చెబుతున్నారు. ఈ కెమెరాలు సౌరశక్తితో పనిచేస్తాయని చెబుతున్నారు. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే అలారం మోగుతుందని వివరిస్తున్నారు. గతంలో టామాట ధరలు పెరిగినప్పుడు కూడా టామాట దొంగతనం జరిగింది. అప్పుడు కూడా కొంతమ మంది రైతులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు.

వెల్లుల్లి ధరలు ఎప్పుడు తగ్గుతాయోనని సామాన్యులు ఎదురు చూస్తున్నారు. సాధారణ నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటాయి. గతంలో టామాట, ఉల్లి ధరలు పెరిగినప్పుడు కేంద్రమే జోక్యం చేసుకుని సబ్సిడీలో టామాట, ఉల్లిని సరఫరా చేశారు. అయితే వెల్లుల్లి ఇంత భారీగా పెరిగినా.. కేంద్రం చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణలో కిలో ఉల్లి రూ.500 గా ఉంది.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వెల్లుల్లిని సబ్సిడీ మీద అందివ్వాలని కోరుతున్నారు. లేకుంటే వెల్లుల్లి కొనే పరిస్థితిలో లేమని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications