Wheat: పెరుగుతున్న గోధుమ ధరలు.. బిస్కెట్లు, బ్రెడ్ ధర పెరిగే అవకాశం..
దేశంలో గోధుమల ధరలు భారీగా పెరిగాయి. మే 2022లో దేశీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల కారణంగా, ప్రభుత్వం గోధుమల ఎగుమతిని నిషేధించింది. అయినా మే నుంచి ఇప్పటివరకు గోధుమల ధరలు 27 శాతం పెరిగాయి. పెరిగే ధరలు కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. అప్పట్లో వంట నూనె ధరులు కూడా భారీగా పెరిగాయి.
దిగుమతి పన్ను
గోధుమల ధరలను నియంత్రించడానికి, ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో నిల్వ చేసిన స్టాక్ నుంచి గోధుమలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇది కాకుండా, దేశంలో గోధుమ దిగుమతిపై 40 శాతం దిగుమతి పన్నును రద్దు అవకాశం కూడా ఉంది. ఎగుమతులను నిషేధించిన తర్వాత కూడా గోధుమల ధరలు పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో గోధుమ ధర టన్ను రూ. 26,500కి పలుకుతున్నాయి.

బిస్కెట్లు, బ్రెడ్ ధర పెరిగే అవకాశం
ప్రపంచంలో గోధుమల ఉత్పత్తిలో భారత్ రెండవ స్థానంలో ఉంది. దేశంలో వినియోగం కూడా చాలా ఎక్కువగా ఉంది. గోధుమ ధరలు పెరిగిన కారణంగా బిస్కెట్లు, బ్రెడ్ వంటి వాటితో తయారైన వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్త గోధుమ క్రాప్ రావాలంటే సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అప్పటి వరకు ధరలను అదుపులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ గిడ్డంగిలో 21.5 మిలియన్ టన్నుల గోధుమల నిల్వ ఉంది. ఆహార సంక్షోభం తలెత్తకుండా బియ్యం, గోధుమలు ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేస్తుంటారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications