దేశంలో గోధుమల ధర పెరుగుతూ వస్తోంది. దీంతో గోధుమల ధరను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీట్ ఈ-వేలం ద్వారా 9.2 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించింది. దీంతో గోధుమ ధరలు 10 శాతానికి పైగా తగ్గాయి. దీంతో సామాన్యకు ప్రజలకు ఉపశమనం కలగనుంది.

మొదటి వారం
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) మొదటి వారంలో 100 నుంచి 499 మిలియన్ టన్నులకు ఈ వేలం నిర్వహించింది. ఈ వేలంలో చిన్న, మధ్య తరహా పిండి మిల్లులు, వ్యాపారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తొలి రెండు రోజుల్లో ఇప్పటివరకు 9.2 లక్షల టన్నుల గోధుమలను బల్క్ వినియోగదారులకు సగటున క్వింటాల్‌కు రూ.2,474 చొప్పున విక్రయించారు.

ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్
ఇటీవల, ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS) కింద బహిరంగ మార్కెట్‌లో బఫర్ స్టాక్ నుంచి 3 మిలియన్ టన్నుల గోధుమలను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో 25 లక్షల టన్నులు బల్క్ వినియోగదారులకు, పిండి మిల్లులకు, 3 లక్షల టన్నులు నాఫెడ్ వంటి సంస్థలకు, మిగిలిన 2 లక్షల టన్నులు రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించనున్నారు.

కిలో రూ.29.50
ప్రభుత్వ సెంట్రల్ స్టోర్‌లో కిలో రూ.29.50 చొప్పున 'భారత్ అట్టా' అందుబాటులో ఉంటుంది. పెరుగుతున్న పిండి ధరలను పరిశీలించి, పిండి సరఫరాను పెంచాలని ఆదేశించారు. మొబైల్ వ్యాన్ల ద్వారా ప్రజలకు పిండి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 6 నుంచి నాఫెడ్ ఈ రేటుకే పిండిని విక్రయించాలని షరతు పెట్టారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications