గత 9 రోజులుగా తగ్గుతోన్న బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. గతేడాది దీపావళి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధర దీపావళి తర్వాత పెరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత జనవరి 3 నుంచి పుత్తడి ధర తగ్గాయి. అయితే బంగారం ధర శుక్రవారం పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.5770 గా ఉంది. 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం రూ. 6295 గా ఉంది.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 57700 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల రూ.62,950 గా ఉంది. ఈ లెక్కన 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరగ్గా, 24 క్యారెట్ల రూ.120 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర జనవరి 2న తులం గోల్డ్ రేటు రూ. 58,750గా ఉంది. దీంతో 9 రోజుల వ్యవధిలో పసిడి ధర రూ. 1150 తగ్గింది. తాజాగా బంగారం ధర రూ. 100 పెరిగింది.

చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్స్ మీద రూ. 100 పెరిగి రూ. 58200 గా ఉంది. 24 క్యారెట్ ధర 10 గ్రాముల బంగారం రూ. 69,140గా ఉంది. వెండి మాత్రం స్థిరంగా ఉంది. ముంబైలో రూ. 57,600, ఢిల్లీ రూ. 57,750, అహ్మదాబాద్, రూ. 57,650, జైపూర్ రూ. 57,750,
లక్నో రూ. 57,750, భువనేశ్వర్ రూ. 57,600, కోల్‌కతా రూ. 57,600, కేరళ 57,600 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications