Today's Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..!
బంగారం కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి తగ్గించడంతో బంగారం ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజా 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 540 పెరిగింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,360 గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 500 పెరిగి రూ. 64,500కు చేరింది. గురువారం కూడా బంగారం ధర పెరిగిన సంగతి తెలిసిందే.
దేశ రాజధాని లో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.64,650 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,510గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.70,370 ఉండగా.. 24 క్యారెట్ల తులం పుత్తడి ధర రూ. 64,510 గా ఉంది.
వెండి కిలో ధర రూ.87,200గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,520 ఉండగా.. చెన్నైలలో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,160గా ఉంది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2450 డాలర్లపైనే కొనసాగుతోంది. ఇది రెండు రోజుల కిందట ఇది 2400 డాలర్ల దిగువనే ఉండేది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు 29 డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది. డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 83.76 వద్ద కొనసాగుతోంది. కాగా బంగారంలో రకాలు ఉంటాయి. 24 క్యారెట్లు అంటే స్వచ్ఛమైన బంగారమని అర్థం. 22 క్యారెట్లు అంటే.. బంగారంలో రాగి కలిపినట్లని అర్థం. ఆభరణాలు 22 క్యారెట్లలోనే లభిస్తాయి.
Note: నగరాన్ని బట్టి బంగారం ధరలు మారవచ్చు. కచ్చితంగా ఇవే ధరలు ఉంటాయని చెప్పలేము.


Click it and Unblock the Notifications