Bakrid 2024: రూ.7 లక్షలు పలికిన మేక.. ఎక్కడంటే..!
పవిత్ర బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గొర్రెలు, మేకల అమ్మకాలు పెరుగుతోన్నాయి. మేకలు, గొర్రెలు కొనుగోలు చేసేందుకు ముస్లింలు బారులు తీరుతున్నారు. డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజులతో పోల్చుకుంటే బక్రీద్ సందర్భంగా వీటి రేట్లు రెట్టింపు అవుతాయని వ్యాపారులు తెలిపారు.
మధ్యప్రదేశ్ భోపాల్‌లో గొర్రెలు, మేకల రేట్లు రికార్డుస్థాయిలో చేరుకున్నాయి. ఒక్కో మేక రూ.50,000 నుంచి రూ.7లక్షల 50వేల వరకు పలుకుతుందని తెలుస్తోంది. తాను పెంచిన రాఫ్తార్ అనే ఓ మేకను రూ.7 లక్షలలకు విక్రయించినట్లు సయ్యద్ షాదబ్ అలీ అనే వ్యక్తి చెప్పారు. దీని బరువు 155 కేజీలు ఉందని వివరించారు. అలాగే షాన్-ఎ- భోపాల్ అనే మరో మేకను రూ.4 లక్షలకు విక్రయించారు.

ముంబై, పూణె, నాగ్‌పూర్, రత్నగిరి, అహ్మదాబాద్, సూరత్, భరూచ్, రాజ్‌కోట్ వంటి నగరాలకు గొర్రెలు, మేకలను అమ్ముతుంటానని వారు పేర్కొన్నారు. సాధారణ రోజుల కంటే బక్రీద్ నాడు వాటికి మంచి డిమాండ్ ఉంటుందని పెంపకపుదారుల చెబుతున్నారు. బక్రీద్ సందర్భంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సోమవారం ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులు కూడా మూసి ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications