Electoral Bonds: దేశంలోని కార్పొరేట్ కంపెనీలు రాజకీయ పార్టీలకు అందిస్తున్న విరాళాలు పెద్ద వివాదానికి కారణంగా మారుతున్నాయి. తమ పనులు చక్కదిద్దుకునేందుకు రాజకీయ పార్టీలు కార్పొరేట్ల నుంచి డబ్బు తీసుకుంటున్నాయా అనే అనుమానాలు ఇటీవలి పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న బీజేపీ చుట్టూ ఈ ప్రశ్నలు పయనిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ప్రమేయం ఉన్న భూ ఒప్పందాలపై చట్టపరమైన పరిశీలన మధ్య DLF నుంచి బీజేపీకి గణనీయమైన విరాళాల వెల్లడి దేశంలో పెద్ద చర్చకు దారితీసింది. దేశంలోని ప్రధాన రియల్టీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న డీఎల్ఎఫ్ గ్రూప్ అక్టోబర్ 2019- నవంబర్ 2022 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రూ.170 కోట్లు విరాళంగా అందించింది.

గురుగ్రామ్‌లోని భూ ఒప్పందాలకు సంబంధించి రాబర్ట్ వాద్రాపై గతంలో అవినీతితో పాటు మోసం ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 2023 నాటికి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ప్రకారం ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదు. ఈ వ్యవహారంలో వాద్రా లేదా డీఎల్‌ఎఫ్‌కి "క్లీన్ చిట్" ఇవ్వలేదని హర్యానా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేయడానికి కొత్త సిట్‌ను ఏర్పాటు చేసింది. వాద్రాను కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో అప్పట్లో పోస్టులు వెల్లువెత్తాయి.
రియల్ ఎస్టేట్ సంస్థలు, వాటి లావాదేవీలపై నిరంతర చట్టపరమైన పరిశీలనను సూచిస్తూ, మరొక సంస్థపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ DLF కార్యాలయాలను శోధించింది. అయితే 2023, 2024 సంవత్సరాల్లో రియల్టీ సంస్థ డీఎల్ఎఫ్ ఎటువంటి ఎలక్టోరల్ బాండ్ విరాళాలు ఇవ్వలేదు. అయితే మెుత్తానికి రూ.170 కోట్ల విరాళం తర్వాత హర్యాణా ప్రభుత్వం నుంచి వాద్రా డీల్ విషయంలో డీఎల్ఎఫ్ క్లీన్ చిట్ పొందిందంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications