Hyderabad: గజానికి రూ.56 వేలే.. హెచ్ఎండీఏ ప్లాట్లకు భారీ డిమాండ్..!

హైదరాబాద్ లో రియాల్ ఎస్టేట్ భూం క్రమంగా ఊపందుకుంటోంది. తాజాగా హెచ్ఎండీఏ(HMDA) పరిధిలో అధికారులు వేలం నిర్వహించారు. బోడుప్పల్ శివారు మేడిపల్లిలో 68 ప్లాట్ల అమ్మకానికి అధికారులు ఈ-వేలం నిర్వహించారు. ఈ వేలానికి కొనుగోలుదారుల నుంచి మంచి డిమాండ్ వచ్చింది. ఈ వేలంలో చదరపు గజానికి రూ.45 వేలు నిర్ణయించి వేలం నిర్వహించారు. దీంతో చాలా మంది వేలంలో పాల్గొన్నారు. హెచ్ఎండీఏ భూములకు అన్ని పత్రాలు ఉంటాయి. వివాదాలు లేని ల్యాండ్, క్లియర్ టైటిల్స్ ఉండడంతో చాలా మంది ఈ వేలంలో పాల్గొన్నారు. ఈ 68 ప్లాట్లలో కొన్ని 231. 66 చదరపు గజాలు ఉండగా.. మరికొన్ని 643 చదరపు గజాలు ఉన్నట్లు అధికారులు వివరించారు.

68 ప్లాట్లలో ఐదింటికి వేలం నిర్వహించలేదు. కొన్ని కారణాల వల్ల వీటికి వేలం నిర్వహించలేదని అధికారులు చెప్పారు. త్వరలోనే వీటికి కూడా ఈ- వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ- వేలం నిర్వహించన ప్లాట్లకు భారీగా ధర పలికింది. అత్యధికంగా చదరపు గజానికి రూ.80 వేలు పలికినట్లు అధికారులు తెలిపారు.యావరేజిగా చదరపు గజానికి రూ.56,260 వచ్చినట్టు అధికారులు వివరించారు. 63 ప్లాట్ల వేలం వేయడం ద్వారా హెచ్ఎండీఏకు రూ.120 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది.

HMDA

కాగా హైదరాబాద్ గత కొద్ది రోజులు రియాల్ ఎస్టేట్ కాస్త స్తబ్దుగా ఉంది. అయినప్పటికీ సామాన్యులు కొనలేని స్థితికి భూముల ధరలు కానీ, ఇళ్ల ధరలు కానీ ఉన్నాయి. శివారు ప్రాంతాల్లోనే 900 ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ కు రూ.60 నుంచి రూ.70 లక్షలు చెబుతున్నారు. ఇక సిటీలో ఉన్న అపార్ట్ మెంట్లు రూ.కోటికి పైనే ఉన్నాయి. మరోపక్క హైదరాబాద్ కొత్త కంపెనీలు రాబడం, ఉన్న కంపెనీలు తమ కార్యకలాపాలు విస్తరించడంతో భూములకు భారీగా డిమాండ్ పెరుగుతోంది.

మూడు వారాల క్రితం రాయదుర్గంలో ఇవాళ టీజీఐఐసీ భూములకు వేలం నిర్వహించింది. ఈ వేలం భూమికి రికార్డ్ స్థాయిలో ధర పలికింది. ఎకరం ధర ఎకంగా రూ.204 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. రాయదుర్గంలో ప్లాట్‌ నంబర్ -4కు చెందిన 5 ఎకరాల 9 గుంటల భూమికి టీజీఐఐసీ వేలం నిర్వహించగా.. ఈ భూములను వంశీరామ్​ బిల్డర్స్​ దక్కించుకుంది. ఇందుకు గానూ ఎకరానికి రూ.204 కోట్లు చెల్లించింది. ఈ వేలం వేయి కోట్లకు పైగా ఆదాయం లభించింది.

ప్రస్తుతం రాయదుర్గం ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.నగరం శివారు ప్రాంతాలు, చుట్టుపక్కల హెచ్‌ఎండీఏ అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. తాజాగా యాక్సెంచర్ కంపెనీ హైదరాబాద్ లో దాదాపు 1 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్థలాన్ని 10 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఇందుకు రూ. 1000 కోట్ల అద్దె చెల్లించనుంది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో అపర్ణ ఐటీ హబ్ ఎల్ఎల్పీ యాజమాన్యంలోని అపర్ణ టెక్నోపాలసీస్ వాణిజ్య భవన సముదాయంలో ఈ స్థలం అద్దెకు తీసుకున్నారు. ఈ కమర్షియల్ సముదాయంలో బ్లాక్ ఏ 1 నుంచి 11 అంతస్తుల వరకు.. బ్లాక్ బీ లో 2 నుంచి 11 అంతస్తుల వరకు విస్తరించి ఉన్నాయి. ఈ లీజు ఒప్పందం 2026 జూన్ 10న జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+