Bengaluru: 2 నెలల డిపాజిట్ యజమాని వద్ద ఉన్నా.. అద్దెదారురాలిని మరింత చెల్లించాలని డిమాండ్..!

బెంగళూరులో అద్దెకు ఉండడమంటే.. డబ్బుండాల్సిందే. బెంగళూరులో రెంట్ తో పాటు ఆరు నెలల అడ్వాన్స్ కూడా కట్టించుకుంటారు. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని అడిగితే అందులో కోతలు పెడతారు. తాజాగా బెంగళూరులో ఇంటి యజమాని, అద్దెదారు మధ్య సెక్యూరిటీ డిపాజిట్ కు సంబంధించి వివాదం తలెత్తింది. 28 సంవత్సరాల వయస్సు గల మహిళ అపార్ట్ మెంట్ ఖాళీ చేసిన తర్వాత యజమాని అడ్వాన్స్ తిరిగి ఇవ్వకుండా అదనంగా రూ.22 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు చెప్పారు.

ఓ మహిళ ఉద్యోగి 2024 అక్టోబర్ లో కోరమంగళలో అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకున్నారు. ఆ సమయంలో ఇల్లు త్వరగా కావాల్సిన పరిస్థితుల్లో రెంట్ అగ్రిమెంట్ పై సంతకం చేసినట్లు ఆమె చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇల్లు ఖాలీ చేసినప్పుడు పెయింటింగ్ ఖర్చుల కింద ఒక నెల అద్దె చెల్లించాలని నిబంధన ఉంది. ఆమె ఆ అపార్ట్ మెంట్ లో 15 నెలలు ఉన్నారు. అయితే అద్దె భారీగా పెంచడంతో 2026లో ఫ్లాట్ ఖాళీ చేశారు.

Rent

అక్టోబర్ 2024లో కోరమంగళలో అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకున్న సదరు మహిళ, అత్యవసరంగా ఇల్లు కావాల్సిన పరిస్థితుల్లో తొందరపాటుతో అద్దె ఒప్పందంపై సంతకం చేశానని చెప్పారు. ఆ ఒప్పందంలో, ఇల్లు ఖాళీ చేసేటప్పుడు పెయింటింగ్ ఖర్చుల కింద ఒక నెల అద్దెను మినహాయించుకునే నిబంధన ఉంది. 15 నెలల పాటు అక్కడ నివసించిన తర్వాత, ఒప్పందంలో పేర్కొన్న పరిమితిని మించి అద్దె పెంపుదల జరగడంతో ఆమె 2026లో ఇల్లు ఖాళీ చేశారు. అయితే రెంట్ కు దిగే ముందే ఇంటి యజమాని రెండు నెలల అద్దెను సెక్యూరిటీ డిపాజిట్ కింద తీసుకున్నాడని తెలిపింది.

పెయింట్ ఖర్చుల కోసం అందులోంచి రూ.20,000 కట్ చేసుకున్నారని వివరించింది. యజమాని మాత్రం అర నెల అద్దె, ఖర్చులతో పాటు మొత్తం రూ.22,000 చెల్లించాలని అడిగినట్లు పేర్కొంది. యజమాని వద్ద ఇప్పటికే రెండు నెలల అద్దెకు సమానమైన డిపాజిట్ ఉంది. అంతేకాకుండా పెయింటింగ్, ఇతర ఖర్చుల కోసం రూ.20,000 ఇప్పటికే మినహాయించుకున్నారు. అయినప్పటికీ 'అర నెల అద్దె' ఇతర ఖర్చుల కోసం ఇంకా రూ.22,000 చెల్లించాలని కోరుతూ యజమాని తనకు పెద్ద సందేశం పంపారని తెలిపారు.

ఇందుకు సంబంధించి రెడిట్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. "15 నెలలు గడిచిన తర్వాత తమ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడంపై ఎలాంటి చర్చ జరగలేదు. ఒప్పందంలో అద్దె పెంపుదల గరిష్ట పరిమితి 5 శాతమని స్పష్టంగా ఉన్నప్పటికీ, అద్దెను 10% పెంచుతున్నట్లు ఆయన అకస్మాత్తుగా నాకు చెప్పారు" అని ఆమె తెలిపారు. యజమాని అదనపు సొమ్ము డిమాండ్ చేయడం సరైందేనా అని ఆమె పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+