Mutual Funds: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు..
ఒకప్పుడు పెట్టుబడి అంటే ఫిక్స్ డ్ డిపాజిట్ లేదా ఏదైనా ట్రెడిషన్ బీమా పాలసీ తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా మంది పెట్టుబడులపై ఒక అవగాహనకు వస్తున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ల గురించి తెలుసుకుంటున్నారు. ఈక్విటీల్లో పెట్టుబడులు పెంచుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెంచుతున్నారు. తెలంగాణ, ఏపీలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేవారు పెరుగుతున్నారని అసోసియేషన్ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన వృద్ధిని సాధించాయి.
తెలుగు రాష్ట్రాల ప్రజల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్( ఏయూఎం) విలువ రూ.2.95 లక్షల కోట్లకు చేరిందని అసోసియేషన్ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా సీఈఓ చలసాని వెంకట్ తెలిపారు.
తెలంగాణ దేశంలోనే ఎనిమిదో స్థానంలో నిలవగా, మొత్తం ఆస్తుల్లో సుమారు 2.5 శాతం వాటా సాధించిందని పేర్కొన్నారు. ఏయూఎం విలువ గత నెల నాటికి రూ.2.12 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 19 శాతం ఎక్కువగా ఉంది.. ఇందులో హైదరాబాద్ వాటాయే 87 శాతం ఉన్నట్లు వివరాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా మ్యూచువల్ ఫండ్ ఖాతాల సంఖ్య 54.44 లక్షలకు చేరుకోగా ఇది దేశంలోని మొత్తం ఖాతాల్లో 2.9 శాతానికి సమానంగా ఉంది.

పెట్టుబడిదారుల భాగస్వామ్యం కేవలం ప్రధాన నగరాలకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోంది. సిస్టమాటిక్ఇన్వెస్ట్మెంట్ప్లాన్(సిప్) విధానం ద్వారా దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు కొనసాగించడం పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సిప్ విధానంలో సగటు ఇన్వెస్ట్మెంట్ రూ.3,200 వరకు చేరుకున్నట్లు వెంకట్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మ్యూచువల్ ఫండ్ పథకాల ఏయూఎం విలువ రూ.82,409 కోట్లకు చేరుకున్నట్లు చెప్పారు. ఇది గత ఏడాది జులైతో పోలిస్తే 23 శాతం వృద్ధిని కనిపించిందని వివరించారు. ఏపీలోని మొత్తం ఆస్తుల్లో విశాఖపట్నం వాటా 20 శాతం కాగా, విజయవాడకు 10 శాతం వాటా ఉందని వెల్లడించారు.
ఏపీలోనూ మ్యూచువల్ ఫండ్ ఖాతాల సంఖ్య 79.44 లక్షలకు చేరింది. ఇది దేశంలోని మొత్తం ఖాతాల్లో 2.9 శాతం వాటాకు సమానంగా ఉంది. రెండు రాష్ట్రాల్లో పెట్టుబడిదారుల భాగస్వామ్యం అన్ని వర్గాలకు విస్తరిస్తోంది. తెలంగాణలోని పెట్టుబడిదారుల్లో 24.42 శాతం మంది మహిళలు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 23.60 శాతం మంది మహిళా పెట్టుబడిదారులు ఉన్నారు. తెలంగాణ జీడీపీ రూ.17.82 లక్షల కోట్లుగా ఉండగా, ఇది దేశ జీడీపీలో 5 శాతం వాటాకు సమానంగా ఉంది. భవిష్యత్తులో మ్యూచువల్ ఫండ్లలో ఇంకా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
