Subhash Chandra: రూ.22 వేల కోట్ల అప్పుకు 6, 203 కోట్లు కడితే చాలట..!
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి దిగ్గజ సంస్థలకు ఏకంగా 99 శాతం నష్టాన్ని మిగుల్చుతూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును చాలా మంది తప్పుపడుతున్నారు. అప్పులు చెల్లించలేక దివాలా తీసిన జీ మీడియా అధినేత సుభాష్ చంద్రకు సంబంధించిన కేసులో ట్రిబ్యునల్ వెలువరించిన ఈ తీర్పు.. రుణదాతలను తీవ్రంగా నిరాశపరిచింది. మెజారిటీ క్రెడిటర్ల ఆమోదం ఉందనే కారణంతో కోట్లలో బాకీ ఉన్న కేసులో కేవలం లక్షల్లోనే రికవరీకి గ్రీన్ సిగ్నల్ లభించడం విస్మయానికి గురిచేస్తోన్నాయి.
ఈ కేసుకు సంబంధించి ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నేతృత్వంలోని అసమ్మతి క్రెడిటర్లు లేవనెత్తిన అభ్యంతరాలను ట్రిబ్యునల్ పట్టించుకోలేదు. తమకు రావాల్సిన రూ.వెయ్యి 322 కోట్ల 39 లక్షల బకాయికి బదులుగా కేవలం రూ.38లక్షలు చెల్లించాలనే ప్రతిపాదన చాలా చిన్నదని వాదనను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ పట్టించుకోలేదు. అలాగే రూ.6 కోట్ల 50లక్షల పేఅవుట్ కూడా అంత స్పష్టంగా లేదని పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనను 80.81 శాతం ఓటింగ్ షేర్ కలిగిన మెజారిటీ క్రెడిటర్లు ఆమోదించారని, వ్యతిరేకించిన వారి వాటా 20 శాతం కంటే తక్కువేనని ఎన్‌సీఎల్‌టీ పేర్కొంది.

ఈ తీర్పుతో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి ఆర్థిక సంస్థలకు ఊహించని భారీ నష్టం వాటిల్లింది. అసలు బాకీతో పోలిస్తే రూపాయిలో కనీస భాగం కూడా రాకపోవడంతో ఆ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే వ్యక్తిగత ఆస్తుల విలువ చాలా తక్కువగా ఉందని, ప్రస్తుత ప్లాన్ ద్వారానే కొంతైనా రికవరీ జరిగే అవకాశం ఉందని రిజల్యూషన్ ప్రొఫెషనల్ నివేదిక వివరించింది. ఒకరి వ్యక్తిగత దివాలా ప్రక్రియ పరిష్కారమైతే, ప్రధాన రుణగ్రహీతల నుంచి బకాయిలు రాబట్టుకోవడానికి క్రెడిటర్లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ట్రిబ్యునల్ తెలిపింది. క్రెడిటర్ల వాణిజ్యపరమైన నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని, తమది కేవలం పర్యవేక్షణ, న్యాయపరమైన పాత్ర మాత్రమేనని తెలిపింది.
ఎన్సీఎల్టీ తీర్పుపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. సామాన్యుడు రూపాయి బాకీ ఉన్న ఆగం చేసే బ్యాంకులు, ఎన్భీఎఫ్సీలు ఇప్పుడు ఏం చేస్తాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.22 వేల కోట్ల అప్పు ఉంటే అందులో 6.5 కోట్లు కట్టాలని తీర్పు చెప్పడం ఏమిటో దారిద్రం అని అంటున్నారు. ఇండియాలోనే ఈ దారిద్రం ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్సీఎల్టీ తీర్పుపై విజయ్ మాల్యా స్పందించారు. తాను చెల్లించాల్సిన రూ. 6వేల 203 కోట్ల అప్పు కంటే అధికంగా రూ.14వేల 100 కోట్లను వసూలు చేశారన్నారు. అంటే అప్పు కంటే డబుల్ పేమెంట్ బ్యాంకులు, ప్రభుత్వం రికవరీ చేసుకున్నాయని మాల్యా పేర్కొన్నారు. అయినప్పటికీ దేశంలో చాలామంది బకాయిదారులు మాత్రం తమ అప్పులను అతి తక్కువ భారాన్ని చెల్లించి సెటిల్ చేసుకుంటున్నారని, ఇదేనా భారతీయ రుణ పరిష్కార వ్యవస్థ అందించే న్యాయం? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications