Mystery shareholder: ఎప్పుడో తాతల కాలంలో కొనుగోలు చేసిన ఆయా కంపెనీల షేర్లు ఇప్పటికీ కొందరి దగ్గర అలాగే ఉన్నాయి. వారసత్వ రీత్యా తర్వాతి తరాలు వాటిని అనుభవిస్తున్నాయి. షేర్ హోల్డర్ల మరణానంతరం వాటిని కాస్తా తమ పేరు మీదకు వారసులు బదిలీ చేసుకుంటూ ఉంటారు. కానీ ఏళ్ల తబడి ఒక షేరు అదే వ్యక్తి పేరు మీద కొనసాగుతూ ఆశ్చర్యపరుస్తోంది.
ఇటీవల టాటా సన్స్ తన షేర్ హోల్డర్ల జాబితాను వెల్లడించింది. దీంతో ఓ వింత వెలుగులోకి వచ్చింది. వీరేంద్ర సింగ్ చౌహాన్ అనే వ్యక్తి టాటా గ్రూప్ మాతృ సంస్థ టాటా సన్స్‌లో ఒక షేరు కలిగి ఉన్నట్లు అందులో ఉంది. మార్చి 2023 నాటికి కంపెనీ అధికారిక షేర్‌హోల్డింగ్ డేటాలో ఇప్పటికీ ఆయనను ఒక షేరుకు యజమానిగా టాటా గ్రూప్ పేర్కొంది.

వీరేంద్ర సింగ్ చౌహాన్ గుజరాత్‌లోని చోటా ఉదయపూర్ అనే చిన్న రాచరిక రాష్ట్రానికి రాజు. ఆయన 2005లో మరణించినప్పటికీ, అతని వారసులకు ఇప్పటికీ ఈ ఒంటరి షేరుపై హక్కు ఉంది. ఈ షేరు ఆయనకు ఎలా సంక్రమించింది అనే విషయం చాలా కాలం ఎవరికీ అర్థం కాలేదు. JRD టాటాతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఆయనకు 12 లేదా 13 షేర్లు ఇవ్వబడినట్లు చౌహాన్ కుమారులు జై ప్రతాప్ సిన్హ్‌జీ 1980లలో పేర్కొన్నారు. తర్వాత జరిగిన లావాదేవీలు గురించి తనకు తెలియవని వెల్లడించారు.
అయితే 1998లో వీరేంద్రసింగ్ తన టాటా సన్స్ షేర్‌లను విక్రయించి బెంగళూరులో దుస్తుల తయారీ కంపెనీ స్థాపించినట్లు జై ప్రతాప్ తెలిపారు. దాని స్థాపనకు అవసరమైన డబ్బును ఇలా సేకరించినట్లు చెప్పారు. కానీ టాటా సన్స్‌లో పూర్తి వాటాను వదులుకునేందుకు ఇష్టం లేక.. ఈ ఒక్క షేరును అలాగే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ వివాదాల కారణంగా ఆ షేరు కాస్తా ఎవరికి చెందాలో తేల్చుకోకపోవడంతో టాటా గ్రూప్ ఇప్పటికీ దానిని వీరేంద్ర సింగ్ పేరిటే చూపిస్తోందని సమాచారం.


Click it and Unblock the Notifications