AK 47: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లిన ఆదర్శ కుటుంబం.. రూ.100 కోట్ల క్లబ్లో చేరుతుందా..!
ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47(AK 47) మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 30న విడుదల చేశారు. ఈ సినిమాకు విడుదల రోజు కాస్త నెగటివ్ టాక్ వచ్చినా.. తర్వాత మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఈ సినిమాకి మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను వచ్చినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లను చేసినట్లు పేర్కొన్నారు. అయితే సోమవారం కలెక్షన్లు భారీగా పడిపోయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదివారం సెలవులు ముగియడం.. సోమవారం వర్కింగ్ డే కావడంతో మూవీ చూసే వాళ్లు తగ్గిపోయారు.
మళ్లీ వీకెండ్ లో ఈ మూవీకి వసూల్లు పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. వెంకటేష్ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. వచ్చే శుక్ర, శని, ఆదివారం వసూల్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. నాలుగో రోజు మన దేశంలో రూ.3.40 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం వసూళ్లతో పోలిస్తే దాదాపు 69.8 శాతం తగ్గుదల ఉందని వెల్లడించాయి. సోమవారం 2,981 షోల ద్వారా తక్కువ వసూల్లు వచ్చినట్లు అంచనా వేసింది . ఈ క్రమంలోనే సినిమా నాలుగు రోజుల్లో రూ. 80 కోట్లకి పైగా గ్రాస్, 42 కోట్లకి పైగా నెట్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు పేర్కొంటున్నాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, శ్రీనిధి జంటగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ మంచి ఎంటర్ టైనర్ గా ఉంటుందని భావించారు. ఈ చిత్రం భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే మిక్స్ డ్ టాక్ రావడంతో కాస్త డిస్సాపాయింట్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కామెడీ, కుటుంబ నేపథ్యంలోని సన్నివేశాలు ఆకట్టుకున్నాయని సినిమా చూసిన వారు చెప్పారు.
అయితే సెకండాఫ్లో మరింత గ్రిప్పింగ్ క్రైమ్ ఎలిమెంట్స్, బలమైన కామెడీ ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదనే చెబుతున్నారు. మూవీ టీం దీపావళి పైనే ఆశలు పెట్టుకుంది. పండుగ సందర్భంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఒకవేళ మూవీ చూసేవారు పెరిగితే వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు మూవీ యూనిట్ భావిస్తోంది.
అయితే ఈ మూవీ బడ్జెట్ రూ.128 కోట్ల వరకు ఉండొచ్చనే అంచనా వేస్తున్నారు. ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్, హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా దాదాపు రూ.70 కోట్ల నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ హక్కుల విలువ దాదాపు రూ.65 కోట్లుగా ఉందని సమాచారం. ఈ లెక్కల ప్రకారం థియేట్రికల్ బ్రేక్ఈవెన్కు సుమారు రూ.70 కోట్ల షేర్ అవసరమని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి. అంటే మూవీకి రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ మూవీ నాలుగో రోజు సినిమా కేవలం రూ.3.40 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించినట్లు సమాచారం.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications