Gold Loans: బంగారం రుణాల జోరు.. భారీగా పెరిగిన గోల్డ్ లోన్లు..!
బంగారం ధరలు పెరగడంతో దేశంలో బంగారం రుణాలు పెరుగుతున్నాయి. ఏ ఆర్థిక అవసరం వచ్చిన తక్కువ వడ్డీతో గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు. బంగారం ఆధారిత రుణ లావాదేవీలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంగా అవతరించగా, సెప్టెంబర్ త్రైమాసికంలో వాహన రుణాల కూడా ఊపందుకున్నాయి. FY27 మొదటి అర్ధభాగంలో భారతదేశ సెక్యూరిటైజేషన్ మార్కెట్ రికార్డు స్థాయికి చేరుకుంది. ఏప్రిల్-సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో గతేడాదితో పోలిస్తే గోల్డ్ లోన్లు 42 శాతం పెరిగి రూ. 1.47 లక్షల కోట్లకు చేరుకున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఐక్రా (Icra) పేర్కొంది. ఇదే కాలంలో బంగారు రుణాల సెక్యూరిటైజేషన్ పరిమాణాలు సుమారు 1.5 రెట్లు పెరిగి, ఇతర ఆస్తి వర్గాల వృద్ధిని అధిగమించాయి.
రెండో త్రైమాసికంలో ఈ మార్కెట్ మరింత వేగం పుంజుకుందని.. లావాదేవీల పరిమాణం రూ. 86,000 కోట్లకు చేరుకుందని వివరించింది. బంగారు రుణాలు, వాహన రుణ లావాదేవీలలో పునరుద్ధరణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME) ఇతర వ్యాపారాలకు రుణాల కార్యకలాపాలు కొనసాగడం ఈ విస్తరణకు దోహదపడిందని పేర్కొంది. FY27లో ఈ మార్కెట్ కనీసం రూ. 2.6 లక్షల కోట్ల నుంచి రూ. 2.7 లక్షల కోట్ల వరకు చేరుకుంటుందని ఐక్రా అంచనా వేస్తోంది. మొదటి అర్ధభాగంలో వృద్ధికి బంగారు రుణాలు ప్రధాన దోహదకారిగా నిలిచాయని ఐక్రా వైస్ ప్రెసిడెంట్, కో-గ్రూప్ హెడ్, స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ రేటింగ్స్ సచిన్ జోగ్లేకర్ అన్నారు.

వాహన రుణాలు, ఎంఎస్ఎంఈ (MSME), వ్యాపార రుణాలు, తనఖా రుణాలు కూడా స్థిరమైన విస్తరణ వేగాన్ని కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. లావాదేవీలలో మూడింట ఒక వంతు వాహన రుణాలే ఉన్నాయని తెలిపారు. FY27 మొదటి అర్ధభాగంలో మొత్తం సెక్యూరిటైజేషన్ పరిమాణాలలో వాహన రుణాల వాటా దాదాపు మూడింట ఒక వంతుగా ఉంది. మొదటి త్రైమాసికంలో ఇది 25 శాతంగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో రుణదాతలు మార్కెట్‌లోకి తిరిగి రావడం లేదా విక్రయించిన రుణాల పరిమాణాన్ని పెంచడం వల్లే ఈ పెరుగుదల నమోదైందని ఐక్రా వివరించింది.
బంగారం ఆధారిత లావాదేవీల వృద్ధితో పాటుగా, నిధుల అవసరాలను తీర్చుకోవడానికి రుణదాతలు రుణాల అమ్మకాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని సూచిస్తున్నాయి. బంగారం ఆధారిత రుణ పోర్ట్‌ఫోలియోల సెక్యూరిటైజేషన్‌లో అధిక కార్యకలాపాలను, బంగారం రుణ సెక్యూరిటైజేషన్‌లో వచ్చిన భారీ పెరుగుదల ప్రతిబింబిస్తుందని ఐక్రా పేర్కొంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications