జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గురువారం నివేదిక విడుదల చేసింది. జులైలో వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కూలీలు రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. జూన్ తో పోలిస్తే, వ్యవసాయ కార్మికుల రిటైల్ ద్రవ్యోల్బణం జులై నెలలో 7.02 శాతం నుంచి 6.17 శాతానికి తగ్గింది. అదేవిధంగా గ్రామీణ కార్మికుల ద్రవ్యోల్బణం 7.04 శాతం నుంచి 6.20 శాతానికి తగ్గింది.
జూన్ లో వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కార్మికుల రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఒక సంవత్సరం క్రితం అంటే జులై 2023లో వ్యవసాయ కార్మికుల రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7.43 శాతం, గ్రామీణ కార్మికులకు 7.26 శాతంగా ఉంది. అయితే ఆహార ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఆందోళన కలిగిస్తోంది. డేటా ప్రకారం జులై నెలలో ఆహార తగ్గినప్పటికీ 5 శాతం కంటే ఎక్కువగా ఉంది. జులైలో ఆహార ద్రవ్యోల్బణం 5.42 శాతంగా ఉంది.

జులైలో మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం 59 నెలల కనిష్ట స్థాయి 3.54 శాతానికి చేరుకుంది. జూన్లో ఆహార ద్రవ్యోల్బణం 9.36 శాతంగా ఉంది. అంతకు ముందు ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం మే నెలలో 8.69 శాతంగా ఉండగా, ఏప్రిల్లో 8.70 శాతంగా ఉంది. వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కూలీలకు ద్రవ్యోల్బణం పెరగడానికి ఆహార ద్రవ్యోల్బణం అత్యంత కారణమని చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications