IT Jobs Fraud: విదేశాల్లో ఐటీ ఉద్యగమంటూ మోసం.. 130 మందిని రక్షించిన విదేశాంగ శాఖ..
విదేశాల్లో ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని భారత్ కు చెందిన 130 మందిని ఓ సంస్థ మోసం చేసింది. ఐటీలో ఉద్యోగాలంటూ 130 మందిని మయన్మార్, కంబోడియాకు తీసుకెళ్లింది. అక్కడికెళ్లిన తర్వాత వారిని బంధించింది. కంబోడియాలో 130 మంది భారతీయ కార్మికులను రక్షించినట్లు MEA అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

60 మంది
మయన్మార్‌లోని మియావడ్డీ ప్రాంతంలో 60 మంది భారతీయ పౌరులను అక్రమంగా బందీలుగా ఉంచినట్లు భారత విదేశంగా గతంలోనే ధృవీకరించింది. కొన్ని మోసపూరిత ఐటీ కంపెనీలు డిజిటల్ స్కామింగ్, నకిలీ క్రిప్టోకరెన్సీలలో నిమగ్నమై ఉన్నట్లు అరిందమ్ బాగ్చి చెప్పారు. భారతీయ కార్మికులను బందీలుగా ఉంచి సైబర్ మోసానికి బలవంతం చేశారని ఆయన విలేకరులతో చెప్పారు.

50 మంది
కంపెనీలు దుబాయ్, బ్యాంకాక్, కొన్ని భారతీయ నగరాల్లో ఏజెంట్ల ద్వారా పనిచేస్తున్నట్లు వివరించారు. థాయ్‌లాండ్‌లో నకిలీ అధిక లాభదాయకమైన ఉద్యోగాల కోసం సోషల్ మీడియా ప్రకటనల ద్వారా భారతీయ యువకులను రిక్రూట్ చేస్తున్నాయని ఆయన చెప్పారు.
మయన్మార్ నుంచి దాదాపు 50 మంది కార్మికులను తిరిగి భారతదేశానికి తీసుకువచ్చారని, మరికొందరు వీసాలు లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించినందున విచారణ కోసం మయన్మార్ పోలీసుల అదుపులో ఉన్నారని వివరించారు.

స్టాలిన్
కంబోడియా, లావోస్ నుండి మరో 80 మంది భారతీయ కార్మికులను రక్షించినట్లు ఆయన చెప్పారు. గత నెలలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తమ రాష్ట్రానికి చెందిన 50 మంది సహా 300 మంది భారతీయులు మయన్మార్‌లో బందీలుగా ఉన్నారని భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. యువకులు మోసపోవద్దని.. మయన్మార్ లో ప్రభుత్వమే లేదని గుర్తు చేశారు.


Click it and Unblock the Notifications