Bengaluru News: బెంగళూరు వాసులకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు.. అతి త్వరలో మెట్రో పింక్ లైన్ ప్రారంభం..!

బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్ రానుంది. ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పింక్ లైన్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. పింక్ లైన్ ప్రారంభానికి సంబంధించిన అనుమతులు 5 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతి రాగానే పింక్ లైన్ లో రైళ్లు నడపనున్నట్లు సమాచారం. అటూ బ్లూ లైన్ ట్రయల్ రన్‌లు అక్టోబర్ చివరి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నగరం అంతటా కనెక్టివిటీని మెరుగుపరిచే ప్రణాళికలలో భాగంగా రాబోయే ఆరెంజ్ లైన్‌లో ఫ్లైఓవర్‌లు, ఒక చిన్న సొరంగం పనులు కొనసాగుతున్నాయి. మెట్రో బ్లూ లైన్‌లోని కె.ఆర్. పురం - సెంట్రల్ సిల్క్ బోర్డ్ మార్గంలో ట్రయల్ రన్‌లు అక్టోబర్ చివరి నాటికి ప్రారంభం కానున్నాయని, అలాగే పింక్ లైన్‌లోని ఎలివేటెడ్ విభాగంలో ప్రయాణీకుల సేవలను ప్రారంభించేందుకు మరో నాలుగు ఐదు రోజుల్లో అనుమతి లభించే అవకాశం ఉందని గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ బైరే గౌడ గురువారం తెలిపారు.

మెట్రో నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కె.ఆర్. పురం నుం చి హెబ్బాల్, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలిపే బ్లూ లైన్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పింక్ లైన్‌లో కాలేన అగ్రహార, తవరకెరె మధ్య ఉన్న 7.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ విభాగంలో ట్రయల్ రన్‌లు ఇప్పటికే పూర్తయ్యాయని గౌడ పేర్కొన్నారు. గత ఏడు-ఎనిమిది నెలలుగా భద్రతా పరీక్షలు, విద్యుత్ సంబంధిత పరీక్షలు నిర్వహించామన్నారు. ఇక మిగిలి ఉన్న ఏకైక దశ, ప్రయాణీకుల సేవలను ప్రారంభించేందుకు అధికారిక అనుమతి పొందడమేనని వెల్లడించారు.

Metro

ఈ ప్రాజెక్టు ప్రారంభ తేదీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత కేంద్ర మంత్రులకు లేఖ రాసింది. ముఖ్యమంత్రి రాసిన లేఖకు ఇంకా ఎటువంటి స్పందన రాలేదని పేర్కొన్న కృష్ణ బైరే గౌడ, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సంబంధిత కేంద్ర మంత్రితో సమావేశం కోరనున్నట్లు తెలిపారు. మెట్రో ఫేజ్ 2A, 2B పరిధిలోకి వచ్చే బ్లూ లైన్ కారిడార్లు బెంగళూరు రవాణా మౌలిక సదుపాయాలకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. అయితే కె.ఆర్. పురం, నాగవార, హెబ్బాల్ మధ్య జరుగుతున్న నిర్మాణ పనులు పలు అడ్డంకుల కారణంగా ఆలస్యమయ్యాయని, దీనివల్ల ప్రాజెక్టు గడువు కంటే కనీసం ఏడాది వెనుకబడిందని ఆయన వివరించారు.

కె.ఆర్. పురం సమీపంలో చెట్లను నరికే అంశంపై కోర్టు స్టే విధించడంతో అక్కడ పనులు సుమారు ఏడాది పాటు నిలిచిపోయాయి. బెంగళూరులో చెట్లను తొలగించేందుకు అనుమతులు పొందే ప్రక్రియలో 'ట్రీ కమిటీ' హైకోర్టు ముందు జరిగే విచారణలు వంటి పలు దశలు ఉంటాయని మంత్రి తెలిపారు. వీరన్నపాళ్య - హెబ్బాల్ మార్గంలో కావేరి నీటి సరఫరా పైప్‌లైన్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను తరలించడం కూడా నిర్మాణ పనులపై ప్రభావం చూపిందన్నారు. 19.75 కిలోమీటర్ల పొడవైన కె.ఆర్. పురం-సెంట్రల్ సిల్క్ బోర్డ్ కారిడార్‌లో, నవంబర్ మొదటి వారం నుండి కొన్ని స్టేషన్ల పరిధిలో దశలవారీగా రైలు సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రాథమికంగా మరతహళ్లి వైపు సేవలను విస్తరించాలని, వచ్చే ఏడాది మధ్య నాటికి కె.ఆర్. పురం నుండి సెంట్రల్ సిల్క్ బోర్డ్ వరకు పూర్తిస్థాయి వాణిజ్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. 38.44 కిలోమీటర్ల కె.ఆర్. పురం-కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ కారిడార్ నిర్మాణం కూడా కొనసాగుతోంది. వచ్చే ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నాటికి హెబ్బాల్-విమానాశ్రయం మార్గంలో రైలు సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ మొదటి వారంలో ట్రయల్ రన్‌లు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+