Media And Entertainment: దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం..
ఇండియాలో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతుంది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం విలువ 2022లో USD 27-29 బిలియన్ల మధ్య ఉంటుందని ఒక నివేదిక అంచనా వేసింది. ఇంది 2030 నాటికి USD 55-65 బిలియన్లకు వృద్ధి చెందుతుందని పేర్కొంది. మహమ్మారి సమయంలో కొన్ని ఎదురుదెబ్బలు చవిచూసిన పరిశ్రమ, కోవిడ్‌కు పూర్వపు వృద్ధిని అందుకుందని ఇండస్ట్రీ బాడీ CII, BCG సంయుక్త నివేదిక తెలిపింది.

55-65 బిలియన్ డాలర్లు
"ఇండస్ట్రీ బలమైన వృద్ధిని సాధిస్తుండడంతో, 2030 నాటికి 55-65 బిలియన్ డాలర్లకు ఎదగడానికి సిద్ధంగా ఉంది, ఇది 65-70 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది, ఇది OTT, గేమింగ్‌లో వృద్ధి ద్వారా కొనసాగుతుందని" అని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక కొన్ని మీడియా విభాగాల పాత్రను హైలైట్ చేసింది. ముఖ్యంగా OTT ప్లాట్‌ఫారమ్‌లు వేగంగా పెరుగుతుందని పేర్కొంది.

స్మార్ట్‌ఫోన్ వినియోగం
ఇంటర్నెట్ తక్కువ ధరకే దొరుకుతుండడం, దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం భారీగా పెరగడంతో 2022లో డిజిటల్ వీడియో & గేమింగ్ విభాగం మీడియా వినియోగంలో 40 శాతానికి పైగా పెరిగిందని నివేదిక వివరించింది. 2020-2022 మధ్య ఇండియా మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ మొత్తం వృద్ధి USD 6 బిలియన్లుగా అంచనా వేశారు. సబ్‌స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ (SVOD) సబ్‌స్క్రిప్షన్‌లు 2022లో 85-90 మిలియన్లకు పెరుగుతాయని నివేదిక అంచనా వేసింది.

ప్రారంభ దశలోనే
ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, మీడియా సంస్థలు, కంటెంట్ సృష్టికర్తలు వీక్షకులకు మరింత దగ్గరయ్యే దిశగా ఇప్పటికే ముందుకు సాగుతున్నారని పేర్కొంది."M&E కంపెనీలు తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి ఈ ట్రెండ్‌లను కొనసాగించాల్సి ఉంటుంది" అని నివేదిక పేర్కొంది.


Click it and Unblock the Notifications