UPI Payments: టెలికాం, రైల్వే, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇన్సూరెన్స్ పేమెంట్లపై రూ.5 ఛార్జీ..!
కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు విధించాలని నిర్ణయించింది. రూ.2000 కంటే ఎక్కువ యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్ ఛార్జీలు వసూలుచేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. వ్యక్తి నుంచి వ్యక్తికి యూపీఐ పేమెంట్ చేస్తే ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు రాజు అనే వ్యక్తి తన స్నేహితుడు శ్రీనుకు రూ.1 లక్ష యూపీఐ చేశాడు. అప్పుడు అతనికి ఎలాంటి ఛార్జీ వర్తించదు. అదే రాజు ఓ షాపింగ్ మాల్ కు వెళ్లాడు. అక్కడ రూ.10 వేల విలువైన షాపింగ్ చేశాడు. అప్పుడు యూపీఐ ద్వారా షాపింగ్ మాల్ కు రూ.10 వేలు చెల్లించాడు. అప్పుడు ఎండీఆర్ ఛార్జీలు పడ్డాయి.
అయితే ఎండీఆర్ ఛార్జీలు షాపింగ్ మాల్స్ భరించాల్సి ఉంటుంది. బ్యాంకులకు 0.4 శాతం ప్రామాణిక రేటుతో ఎండీఆర్ చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్ రూ. 3,000 చెల్లింపు చేస్తే.. 0.4% ప్రకారం వ్యాపారి రూ. 12 రుసుము చెల్లించాలి. రూ. 50,000 చెల్లింపు జరిగినప్పుడు 0.4% చొప్పున వ్యాపారిపై రూ.200 రుసుము పడుతుంది. యూపీఐ చెల్లింపులకు ఒకే ఛార్జీని నిర్ణయించలేదు. మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధానంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా కొన్ని కీలక మినహాయింపులు ఇచ్చింది. టెలికాం, రైల్వే, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇన్సూరెన్స్ పేమెంట్లపై భారీ MDR చార్జీల అత్యల్పంగా నిర్ణయించింది.

ఈ కేటగిరీ చెల్లింపులపై ఒక ఫ్లాట్ ఫీజును ప్రకటించారు. ఈ ప్రత్యేక కేటగిరీల్లో జరిగే లావాదేవీలపై పేమెంట్ ఎంత ఉన్నా సరే దానితో సంబంధం లేకుండా కేవలం రూ. 5 మాత్రమే ఫ్లాట్ ఫీజుగా వసూలుకు అవకాశం కల్పించారు. అలాగే అత్యధిక విలువతో కూడిన స్టాక్ మార్కెట్ లావాదేవీలకు మాత్రం MDRను అత్యంత కనిష్టంగా 0.02 శాతానికే పరిమితం చేశారు. మధ్యతరగతి, పేద వర్గాలపై ఆర్థిక భారం పడకుండా రక్షణ కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎందుకంటే టెలికాం రీచార్జ్‌లు, రైలు టికెట్ల బుకింగ్, వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడం వంటివి సామాన్యులు రోజువారీ జీవితంలో అత్యధికంగా ఉపయోగించే సేవలు కాబట్టి. ఒకవేళ వీటికి సాధారణ MDR వర్తిస్తే సామాన్యుల జేబులకు చిల్లు పడే అవకాశం ఉందని.. అందుకే ఫ్లాట్ రూ.5 ఫీజు వల్ల ఈ నిత్యావసర సేవలు అదనపు భారాలు లేకుండా సాగిపోతాయని వివరించింది.
వ్యాపారులు ఎండీఆర్ ఛార్జీలను నేరుగా కస్టమర్లపైకి నెట్టివేయకుండా NPCI కఠినమైన నిబంధనలు అమలు చేయనుంది. ఏ రంగంలోనైనా సరే కస్టమర్ల నుంచి అదనంగా వసూలు చేయడానికి వీల్లేదని అక్వైరర్ బ్యాంకులను అంటే వ్యాపారి బిజినెస్ అకౌంట్ ఉన్న బ్యాంకులకు స్పష్టంగా ఆదేశించింది. అయినప్పటికీ వ్యాపారులు కస్టమర్ల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
