LIC: ఎల్ఐసీ నుంచి అదిరిపోయే రెండు కొత్త పాలసీలు.. వాటి పూర్తి వివరాలు..!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త పాలసీలను ప్రకటించింది. ఇందులో 'LIC బీమా ప్లాటినం' (ప్లాన్ 770), 'LIC జీవన్ రక్ష' (ప్లాన్ 894) ఉన్నాయి.
LIC బీమా ప్లాటినం
LIC బీమా ప్లాటినం' అనేది పొదుపు, ఆర్థిక రక్షణ రెండింటినీ అందించే ఒక నాన్-పార్, నాన్-లింక్డ్ (మార్కెట్‌తో సంబంధం లేని) వ్యక్తిగత పాలసీ. పరిమిత ప్రీమియం చెల్లింపు కాలం (PPT) కలిగిన ఈ పథకం, ఆ కాలంలో చెల్లించే ప్రతి రూ. 1,000 వార్షిక ప్రీమియంకు రూ. 70 చొప్పున హామీతో కూడిన అదనపు మొత్తాన్ని అందిస్తుంది. ఈ పథకంలోని ఒక ఆకర్షణీయమైన అంశం బూస్టర్ ఆదాయ ప్రయోజనం. ఇది ప్రాథమిక బీమా మొత్తంలో 70 శాతానికి సమానంగా ఉంటుంది. బీమా చేయబడిన వ్యక్తి ప్రీమియం చెల్లింపు కాలం ముగిసిన తర్వాత మరో 5 సంవత్సరాల పాటు జీవించి ఉంటే ఈ ప్రయోజనం లభిస్తుంది.
అలాగే 'పే-అవుట్' కాలంలో ప్రతి సంవత్సరం చివరన, ప్రాథమిక బీమా మొత్తంలో 10 శాతానికి సమానమైన సాధారణ ఆదాయ ప్రయోజనాన్ని కూడా ఈ పథకం అందిస్తుంది. కనీస ప్రాథమిక బీమా మొత్తం రూ. 3,00,000 ఉండగా.. దీనికి గరిష్ట పరిమితి లేదు. అయితే, గరిష్ట ప్రాథమిక బీమా మొత్తం అనేది LIC బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ విధానం ప్రకారం నిర్ణయిస్తారు. ప్రీమియం చెల్లింపు కాలం (PPT) కోసం 7, 10, 12, 15, 18 సంవత్సరాల ఎంపికలు ఉన్నాయి. అంటే ప్రీమియం ఏదేళ్లు కట్టొచ్చు లేదా 10, 12, 15,18 సంవత్సరాలు కూడా చెల్లించవచ్చు. మీరు ఎక్కువ సంవత్సరాలు కడితే ఎక్కవు మొత్తం లభిస్తుంది. ఈ పాలసీ కనీస వయస్సు 30 రోజులు నెల రోజుల శిశువు నుంచి 55 సంవత్సరాల వయసు గల వారు కొనుగోలు చేయవచ్చు.

ఇప్పటికే LIC పాలసీలు కలిగి ఉన్నవారికి, మరణించిన పాలసీదారుల నామినీలు లేదా లబ్ధిదారులకు రాయితీలు లభిస్తాయి. పాలసీదారులు ఈ పథకం కింద అందుబాటులో ఉన్న వివిధ 'రైడర్' ప్రయోజనాలను ఎంచుకోవడం ద్వారా తమ బీమా రక్షణను పెంచుకోవచ్చు.
LIC జీవన్ రక్ష
LIC జీవన్ రక్ష అనేది ఒక నాన్-పార్, నాన్-లింక్డ్, ప్యూర్ టర్మ్ ప్లాన్. పాలసీ కాలంలో బీమా చేసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో, ఇది వారి కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఈ ప్లాన్ కింద చెల్లించబడే మరణ ప్రయోజనాలు, వాస్తవ అనుభవంతో సంబంధం లేకుండా, హామీ ఇచ్చిన మొత్తం చెల్లిస్తారు.. ఈ పాలసీకి బోనస్‌లు లేదా మిగులులో ఏదైనా వాటా వంటి విచక్షణతో కూడిన ప్రయోజనాలకు అర్హత లేదు. ఈ పాలసీ 18 సంవత్సరాలు నుంచి 45 సంవత్సరాల వయసు గల వారు కొనుగోలు చేయవచ్చు. కనీస ప్రాథమిక బీమా మొత్తం రూ. 5 లక్షలు కాగా, గరిష్టంగా రూ. 24 లక్షలుగా నిర్ణయించారు.
ఈ ప్లాన్ లో సింగిల్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం, పరిమిత ప్రీమియం చెల్లింపులు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్లాన్ కింద మహిళలకు ప్రత్యేక రేట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ కింద కవరేజీని పెంచుకోవడానికి రైడర్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో తక్కువ బీమా వ్యాప్తి, ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న గృహాదాయాలు, పెరిగిన ఆర్థిక అవగాహన, సుదీర్ఘ ఆయుర్దాయం రాబోయే ఏళ్లలో రక్షణ, పొదుపు, పదవీ విరమణ పాలసీలకు మంచి గిరాకీని సృష్టిస్తాయని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.దొరైస్వామి తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications