Ban On Gutkha, Pan Masala: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుట్కా, పాన్ మాసాలపై నిషేధం..
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్య ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా పొగాకు లేదా నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలాల తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, అమ్మకాలను ఒక సంవత్సరం పాటు నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఆగస్ట్ 10 2026 తేదీన కర్ణాటక రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌ను, ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006లోని సెక్షన్ 30, సబ్-సెక్షన్ (2)లోని క్లాజ్ (ఎ)తో పాటు, ఆహార భద్రత, ప్రమాణాల (అమ్మకాలపై నిషేధం పరిమితులు) నిబంధనలు, 2011లోని రెగ్యులేషన్ 2.3.4 ప్రకారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ ఉత్తర్వుల ప్రాకరం పొగాకు లేదా నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలాలపై నిషేధం కొనసాగుతోంది. అంతేకాకుండా, వాటి పేరుతో సంబంధం లేకుండా, తుది ఉత్పత్తిలో పొగాకు లేదా నికోటిన్‌ను కలిగి ఉండి, విడిగా విక్రయించబడే ఏ ఇతర ఉత్పత్తులకైనా నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అటువంటి ఉత్పత్తులు ప్యాక్ చేయబడి ఉన్నా లేదా ప్యాక్ చేయబడకపోయినా, వాటిని ఒకే ఉత్పత్తిగా విక్రయించినా లేదా వినియోగదారుడు సులభంగా కలపడానికి వీలుగా వేర్వేరు ఉత్పత్తులుగా ప్యాక్ చేసి విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

పొగాకు, నికోటిన్‌ను ఒక పదార్ధంగా కలిగి ఉండి, సాచెట్లు, పౌచ్‌లు, ప్యాకేజీలు లేదా కంటైనర్లలో లేదా మరే ఇతర పేరుతోనైనా ప్యాక్ చేసిన గుట్కా, పాన్ మసాలాపై కూడా నిషేధం వస్తుంది. నిషేధిత పొగాకు లేదా నికోటిన్ ఉత్పత్తుల తయారీ, అమ్మకం లేదా పంపిణీకి సంబంధించిన ఏ సమాచారం లభించినా సంబంధిత అధికారులకు తెలియజేయాలని కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ ప్రజలను కోరింది. రాష్ట్రంలో పొగాకు వ్యసనాన్ని అరికట్టడం, ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత కర్ణాటకను నిర్మించడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నిర్ణయాన్ని మాదకద్రవ్య రహిత, ఆరోగ్యకరమైన కర్ణాటక దిశగా ఒక అడుగుగా ప్రభుత్వం పేర్కొంది. అయితే సిగరేట్లలో కూడా పొగాకు ఉంటుందని, వాటిని ఎందుకు బ్యాన్ చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. సిగరేట్లపై కూడా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గుట్కాపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్, అస్సాంలో నిషేధం విధించారు. అయినప్పటికీ తెలంగాణలో గుట్కా అనధికారంగా అమ్ముతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications