Success Story: డెలివరీ బాయ్ నుంచి వాట్సాప్ సీఈఓగా.. ఓ సామాన్యుడి విజయ గాథ..!
డెలివరీ బాయ్ గా ప్రస్థానాన్ని మొదలు పెట్టి.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్న అతిపెద్ద మెసేజింగ్ యాప్ వాట్సాప్ సీఈఓగా మారాడు. అతనే కునాల్ షా. అయితే ఆయనకు ఈ విజయం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. దీని వెనక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది. కునాల్ షా 1979లో ముంబైలో జన్మించారు. అయితే ఆయన తండ్రి చేస్తున్న వ్యాపారంలో నష్టాలు రావడంతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారింది. షా 15 ఏళ్ల వయసులోనే తన కుటుంబాన్ని పోషించడానికి పని చేయాల్సి వచ్చింది. 16 ఏళ్ల వయస్సు వచ్చేసరికే కునాల్ డెలివరీ బాయ్, డేటా-ఎంట్రీ ఆపరేటర్, సైబర్ కేఫ్ మేనేజర్, కంప్యూటర్ ట్యూటర్, పైరేటెడ్ సీడీలు అమ్మే పని చేశాడు.
మెహందీ కోన్‌లు కూడా అమ్మాడు. ఈ అనుభవాలే ఆయన్ను జీవితంలో రాటుదేలేలా చేశాయి. సమాజ పరిస్థితులను పూర్తి అర్థం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే విల్సన్ కళాశాల నుంచి తత్వశాస్త్రంలో డిగ్రీ పొందారు. ఎంబీఏ కోసం నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ లో చేరాడు. అయితే అక్కడ చదువు పూర్తి కాకముందే ఆర్థిక పరిస్థితుల వల్ల మధ్యలోనే ఆపేశాడు. అయితే ఏదో ఒక బిజినెస్ చేయాలని అతనికి ఉండేది. అయితే అందుకు డబ్బులు కావాలి. అందుకే తక్కువ పెట్టుబడితో స్టార్టప్ ఏర్పాటు చేయాలనుకున్నాడు.

2010లో డిజిటల్ చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్రీఛార్జ్‌ను స్థాపించారు. ఫ్రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపులు చేసే వినియోగదారుల కోసం రివార్డులు కూడా ఇచ్చింది. ఈ ప్రయత్నం చాలా మందిని ఆకర్షించింది. దీంతో లక్షలాది మంది ఫ్రీఛార్జ్ ను వాడడం మొదలు పెట్టారు. దీంతో పెద్ద కంపెనీల కన్ను ఫ్రీఛార్జ్ ప పడింది. స్నాప్ డీల్ 2015లో ఫ్రీఛార్జ్ ను దాదాపు 400 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కంపెనీని 5 ఏళ్లలోనే 400 మిలియన్ డాలర్లకు తీసుకొచ్చిన ఘనత కునాల్ షాకు దక్కింది. దీంతో ఆయన గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కునాల్ షా 2018 లో ఒక మిలియన్ డాలర్లలో క్రెడ్ ను స్థాపించారు.
క్రెడ్ లో క్రెడిట్ కార్డు బిల్లులు, రీఛార్జ్, అలాగే లోన్లు కూడా తీసుకోవచ్చు. అలాగే వినియోదారులకు రివార్డులు కూడా ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే క్రెడ్ క్రమంగా ప్రజాధారణ పొందింది. వినూత్న ప్రచారంతో కూడా క్రెడ్ దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరుకోగలిగింది. ప్రస్తుతం క్రెడ్ దాదాపు 17 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. క్రెడ్ ఈ స్థాయికి చేరుకోవడానికి కునాల్ ఎంతో కృషి చేశారు. తాజాగా కునాల్ షా వాట్సాప్ సీఈఓ ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించి మెటా కంపెనీ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. టీనేజ్ డెలివరీ బాయ్ నుంచి వాట్సాప్ చీఫ్ అయ్యారంటే.. నిజంగా కునాల్ షా జర్నీ అందరికీ ఆదర్శం.


Click it and Unblock the Notifications