Mahanadi Coalfields IPO: నవంబర్ 19 నుంచి మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓ..
దేశంలోనే అతిపెద్ద బొగ్గు గనుల సంస్థ అయిన కోల్ ఇండియా అనుబంధ సంస్థ మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓగా రానుంది. నవంబర్ 19న తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ను పబ్లిక్ సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభం కానుంది. క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీఓతో పాటు వచ్చే వారం ప్రారంభమయ్యే రెండో మెయిన్‌బోర్డ్ ఐపీఓ ఇదే కానుంది. ఈ ఐపీఓలో ప్రమోటర్ అయిన కోల్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనుంది. మహానది కోల్‌ఫీల్డ్స్ మొత్తం పెయిడ్-అప్ ఈక్విటీ క్యాపిటల్‌లో 10 శాతానికి సమానమైన 66.18 కోట్ల ఈక్విటీ షేర్లను ఐపీఓ ద్వారా విక్రయించనుంది. ఇష్యూ ఖర్చులను మినహాయించి.. ఈ ఆఫర్ ద్వారా వచ్చే మొత్తం రాబడి విక్రయ వాటాదారు అయిన కోల్ ఇండియాకే చెందనుంది.
ఈ ఐపీఓ నుంచి కంపెనీకి ఎటువంటి నిధులు అందవు. సంస్థాగత పెట్టుబడిదారుల కోసం వన్-డే యాంకర్ బుక్ నవంబర్ 18న ప్రారంభం అవుతుంది పబ్లిక్ సబ్స్క్రిప్షన్ కోసం ఐపీఓ నవంబర్ 23న ముగుస్తుంది. షేర్ల కేటాయింపు నవంబర్ 25న ఖరారు అయ్యే అవకాశం ఉంది. మహానది కోల్‌ఫీల్డ్స్ షేర్లు నవంబర్ 27న స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానున్నాయి. భారత్ కోకింగ్ కోల్, సెంట్రల్ మైన్ ప్లానింగ్ & డిజైన్ ఇన్స్టిట్యూట్ తర్వాత, స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానున్న మూడో కోల్ ఇండియా అనుబంధ సంస్థ మహానది కోల్‌ఫీల్డ్స్ కానుంది. దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన కోల్ ఇండియా, తన ఉద్యోగుల కోసం 3.3 కోట్ల ఈక్విటీ షేర్లను, కోల్ ఇండియా వాటాదారుల కోసం 6.61 కోట్ల షేర్లను రిజర్వ్ చేసింది.

ఉద్యోగులు, వాటాదారుల కోసం రిజర్వ్ చేసిన భాగాలను మినహాయించి, నికర ఆఫర్లో 50 శాతం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు (QIBs), 15 శాతం సంస్థాగేతర పెట్టుబడిదారులకు (NIIs), మిగిలిన 35 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు కేటాయించారు. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి, ఒడిశాలోని తాల్చేర్, ఇబ్ వ్యాలీ అనే రెండు బొగ్గు క్షేత్రాల నుంచి బొగ్గు ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో, సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ నుంచి వేరుచేసి ఏప్రిల్ 1992లో మహానది కోల్ఫీల్డ్స్ను ఏర్పాటు చేశారు. ఈ బొగ్గు క్షేత్రాలలో దాదాపుగా 106.76 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని అంచనా.
ఇది కోల్ ఇండియా అనుబంధ సంస్థలలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కోల్ ఇండియా మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 28.4 శాతం, దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 21 శాతం వాటాను ఇది కలిగి ఉంది. దీని వనరులలో ప్రధానంగా థర్మల్-గ్రేడ్ నాన్-కోకింగ్ బొగ్గు ఉంటుంది. సెప్టెంబర్ 2026తో ముగిసిన ఆరు నెలల కాలానికి మహానది కోల్‌ఫీల్డ్స్ లాభం గతేడాదితో పోలిస్తే 6.7 శాతం పెరిగి రూ. 4,880.7 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే, ఇదే కాలంలో ఆదాయం 9.3 శాతం పెరిగి రూ. 16,093 కోట్లకు చేరుకుంది. మార్చి 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి, గత ఏడాదితో పోలిస్తే లాభం 1.2 శాతం తగ్గి రూ. 10,698.1 కోట్లకు చేరగా, ఆదాయం 2.6 శాతం తగ్గి రూ. 30,549.6 కోట్లకు పడిపోయింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications