Star Health Insurance: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి షాక్.. రూ.2 కోట్ల జరిమానా విధించిన IRDAI

హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఇన్సూరెన్స్ తీసుకున్నా పలు ఇన్సూరెన్స్ సంస్థలు క్లెయిమ్స్ రిజక్ట్ చేస్తున్నాయి. తక్కువ ప్రీమియం ఉంటుంది. ఎక్కవ కవరేజ్ ఉంటుందని చెప్పి ఏజెంట్లు పాలసీలు అంటగడుతున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి ఎలాంటి వివరాలు చెప్పకుండా పాలసీలు కొనిపిస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ రిజక్ట్ చేయడం. క్లెయిమ్ యాక్సెప్ట్ చేసినా ఆస్పత్రులకు బిల్లు లేటుగా చెల్లించడం చేస్తున్నాయి. తాజాగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పై భారత బీమా నియంత్రణ అభివృద్ధి కొరఢా ఝలిపించింది. ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను నిర్వహించిన విధానంలో ఉల్లంఘనలకు పాల్పడినందుకు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌ కు రూ. 2 కోట్ల జరిమానా విధించింది.

ఆమోదయోగ్యం కాని కారణాలతో క్లెయిమ్‌లను తిరస్కరించడం, పాలసీ నిబంధనలలో తగిన మద్దతు లేకుండా కోతలు విధించడం, తమ క్లెయిమ్‌లను ఎందుకు తిరస్కరించారో లేదా తగ్గించారో వినియోగదారులకు సరిగ్గా తెలియజేయకపోవడం వంటి కారణాలతో భారత బీమా నియంత్రణ అభివృద్ధి ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని సందర్భాల్లో IRDAI తనిఖీ సమయంలో వ్యత్యాసాలను గుర్తించడంతో బీమా సంస్థ వివాదాస్పద క్లయిమ్ మొత్తాలను చెల్లించింది. 2022 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 మధ్య IRDAI నిర్వహించిన తనిఖీ అనంతరం ఈ జరిమానా విధించారు.. 2024 డిసెంబర్‌లో షో-కాజ్ నోటీసు జారీ చేసి 2025 జూన్‌లో వ్యక్తిగత విచారణ జరిపిన అనంతరం రెగ్యులేటర్ 2026 నవంబర్ 20న ఫైన్ విధిస్తున్నట్లు ఉత్తర్వును జారీ చేసింది.

Star Health

స్టార్ హెల్త్ కోవిడ్-19 సంబంధిత క్లెయిమ్‌లతో సహా కొన్ని క్లెయిమ్‌లను, ఆమోదయోగ్యం కాని కారణాలతో తిరస్కరించిందని IRDAI గుర్తించింది. వర్తించే పాలసీ నిబంధనలకు అనుగుణంగా లేని క్లెయిమ్ కోతలను కూడా కనుగొన్నారు. ఈ రూ. 2 కోట్ల జరిమానాలో క్లెయిమ్ తిరస్కరణలకు సంబంధించిన ఉల్లంఘనలకు రూ. 1 కోటి, ఆధారరహిత కోతలు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిర్ణయాల గురించి సరిగా తెలియజేయనందుకు మరో రూ. 1 కోటి జరిమానా విధించింది. పాలసీదారులు ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. పాలసీదారుల క్లెయిమ్‌ను ఏకపక్షంగా తిరస్కరించలేరని గుర్తుంచుకోవాలి.

లసీ మినహాయింపులు లేదా పూర్తి చేయని వెయిటింగ్ పీరియడ్‌ల వంటి చట్టబద్ధమైన కారణాలపై బీమా సంస్థలు క్లెయిమ్‌లను తిరస్కరించే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి తిరస్కరణకు పాలసీ నిబంధనలు, షరతులు తప్పనిసరిగా ఉండాలి. క్లెయిమ్ ఎందుకు తిరస్కరించరో మెన్షన్ చేయాలి. అకారణంగా మీ క్లెయిమ్ తిరస్కరిస్తే భారత బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు.
స్టార్ హెల్త్ విషయంలో IRDAI ఆమోదయోగ్యం కానివిగా భావించిన కారణాలతో క్లెయిమ్‌లు తిరస్కరించిన సందర్భాలను గుర్తించి ఫైన్ విధించిందని గుర్తుంచుకోవాలి. నెట్‌వర్క్ ఆసుపత్రులతో చర్చల ద్వారా పొందిన డిస్కౌంట్లు, పునరుద్ధరణ ప్రీమియంలను ముందుగానే వసూలు చేయడం, ఫిర్యాదుదారులకు ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ వివరాలను అందించడంలో విఫలమవడం వంటి సమస్యలను స్టార్ హెల్త్ లో గుర్తించారు. అందుకే పాలసీ తీసుకునేటప్పుడు అన్ని పరిశీలించారు. అన్ని తెలుసుకున్న తర్వాతే పాలిసీ కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+