మనకి ఇంతవరకు దేశాలు, దీవిల గురించి గుర్తొచ్చేటప్పుడు వీసా అవసరమా? పాస్‌పోర్ట్ తీసుకెళ్లాలా? అక్కడ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? ఇవే మనసులోకి వస్తాయి. కానీ ఇప్పుడు ఈ తరహా ఆలోచనలకే ఓ కొత్త మలుపు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఓ భారతీయ మూలాలున్న అమెరికన్ ఎంట్రప్రెన్యూర్ బాలాజీ శ్రీనివాసన్. ఆయన బిట్‌కాయిన్ సహాయంతో సింగపూర్‌కి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ దీవిని కొన్నాడు. ఇక ఆ దీవిని టెక్నాలజీపై ఆధారపడి పనిచేసే స్టార్టప్ ఫౌండర్లు, డిజిటల్ నొమాడ్స్, డెవలపర్లు, ఇన్నోవేటర్ల కోసం ఓ ప్రత్యేక దేశంగా మార్చాలన్న ప్రయత్నం పై అడుగులు వేస్తున్నాడు.

బాలాజీ శ్రీనివాసన్ ఎవరు?
బాలాజీ శ్రీనివాసన్ ఓ టెక్నాలజీ దిగ్గజం. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుండి బయోటెక్నాలజీలో డాక్టరేట్ చేసి, కౌన్సిల్(Counsyl) అనే జెనెటిక్ టెస్టింగ్ కంపెనీని స్థాపించారు. తరువాత కాయిన్‌బేస్(Coinbase) అనే క్రిప్టోకరెన్సీ కంపెనీలో CTOగా పనిచేశారు. ఆయన తల్లిదండ్రులు తమిళనాడులోని వైద్యులు, ఆయన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో BS, MS, PhD డిగ్రీలు పొందారు. ఆపై ఆయన విజనరీ ఎంటర్‌ప్రెన్యూరగా గుర్తింపు పొందారు.
దీవిని ఎందుకు కొన్నారు?
బాలాజీకు చిన్నప్పటి నుండి ఒక నెట్‌వర్క్ రాష్ట్రం(Network State) మొదలు పెట్టాలనే డ్రీమ్ ఉంది. అంటే ఇంటర్నెట్ ఆధారంగా ఏర్పడిన సమాజం. దాని కోసం నిజంగానే ఓ ప్రైవేట్ దీవిని కొనడం మొదటి అడుగు. దీన్ని బిట్‌కాయిన్‌తో కొనడం వల్ల టెక్నాలజీ మీద ఆయన నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్ స్కూల్ మలేసియాలో ఫారెస్ట్ సిటీ, సింగపూర్‌కి సమీపంలో ఉంది .
ఎందుకు ఈ దేశం? ఎందుకు టెకీల కోసమే?
ఎందుకు టెక్నాలజీపై ఆశించిన వాళ్లకు, ఫ్రీగా ఆలోచించాలనుకునే యువతకు, సమర్థత ఉన్నవాళ్లకు ఒక స్వతంత్రమైన, సహజమైన వేదిక ఉండకూడదా అన్నా ఆలోచన నుంచి వచ్చినదే ఈ దేశం. టెక్ ప్రపంచం రోజురోజుకు పెరుగుతోంది, కానీ స్టార్టప్‌లు, AI, బ్లాక్‌చెయిన్ రంగాల్లో ఉన్నవాళ్లకి ఒక ఫ్రీ, ఫాస్ట్, ఫోకస్‌డ్ ప్రపంచం ఉండాలి. అందుకే టెకీల కోసం ఓ కొత్త దేశం స్థాపించాలనుకున్నాడు. ఆన్‌లైన్‌లో మొదలై, ఆఫ్‌లైన్‌లో నివసించగలిగే ఓ డిజిటల్ సమాజం. ఇది ప్రభుత్వ నియంత్రణ లేకుండా, ఆచరణాత్మకంగా పనిచేసే ప్రగతిశీల వేదిక అవుతుంది.
అక్కడ ఏం జరుగుతోంది?
ఈ దీవిలో ఇప్పుడు నెట్‌వర్క్ స్కూల్(Network School) అనే పేరుతో 3 నెలల శిక్షణా శిబిరం జరుగుతోంది. ఇది సామాన్య స్కూల్ కాదు ఇది స్టార్టప్ వ్యవస్థాపకులు, టెక్నాలజీ ప్రియులు, డిజిటల్ నోమాడ్లు, ఫిట్‌నెస్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇక్కడ రోజూ ఉదయం వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, స్టార్టప్ ఫౌండేషన్, AI, బ్లాక్‌చెయిన్, క్రిప్టో వంటి కోర్సులను నేర్పిస్తారు. టీమ్ వర్క్, లీడర్షిప్, స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇవన్నీ అక్కడ అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి బాలాజీ "Stanford on an island" అని పేరు పెట్టాడు అంటే సముద్ర మధ్యలో ఉన్న స్టాన్‌ఫోర్డ్ లాంటి స్మార్ట్ ప్రదేశం అని.
నెట్‌వర్క్ స్టేట్ అంటే ఏమిటి?
బాలాజీ "నెట్‌వర్క్ స్టేట్" అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంటే ముందుగా ఆన్‌లైన్‌లో ఓ లైక్-మైండెడ్ పీపుల్ కలిసే కమ్యూనిటీ, తరువాత వాళ్లు కలిసికట్టుగా ఓ ప్రదేశాన్ని ఏర్పరచుకొని, దాన్ని చిన్న దేశంగా తయారు చేసుకుంటారు.
ఈ కమ్యూనిటీలో దూరంగా (remote) పనిచేసే వారు, డిజిటల్ నోమాడ్స్, ఆన్‌లైన్ కంటెంట్ క్రియేటర్లు, వ్యక్తిగత శిక్షకులు, ఈవెంట్ ప్లానర్లు, స్వీయ అభివృద్ధి కోరుకునే వారే కాక, అన్ని రంగాల టెక్నాలజీ నిపుణులు కూడా ఎంతో కీలక పాత్ర పోషించగలరని బాలాజీ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, కొత్తగా అభివృద్ధి అవుతున్న కమ్యూనిటీకి టెక్నాలజీ నేర్పించడంలో, క్రిప్టోకరెన్సీ సంపాదించే మార్గాలు చూపించడంలో, ఆరోగ్యంగా ఉండేందుకు క్యాలరీలు ఖర్చు చేసేలా (వ్యాయామం ద్వారా) ప్రోత్సహించడంలో, అలాగే సరదాగా గడిపే కల్చర్‌ను పెంచే విషయంలో సహాయపడగలవారిని మేము ఆహ్వానిస్తున్నాం అని ఆయన తెలిపారు.
ఈ నెట్‌వర్క్ స్కూల్ విజయవంతమైతే, ఇలాంటి డిజిటల్ కమ్యూనిటీలను డుబాయ్, టోక్యో, మియామీ లో ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారు.
ఇది సాధ్యమేనా?
సాధ్యమే! ఎందుకంటే ఇదివరకు కూడా మనం చూశాం ఫేస్‌బుక్ ఒక కమ్యూనిటీగా మొదలై ప్రపంచాన్ని మార్చింది. జూమ్ ఒక అప్లికేషన్‌గా మొదలై సంబంధాల రీతిని మార్చింది. ఇప్పుడు ఇదీ ఒక డిజిటల్ కమ్యూనిటీ, ఓ దేశంగా మారే ప్రయోగం. ఇది చిన్నదైనా మొదటి అడుగు. కానీ భవిష్యత్తులో ఇలా మరెన్నో టెక్ ఆధారిత దేశాలు, లిబరల్ కామ్యూనిటీల రూపంలో ముందుకొస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications