IRCTC: 9 రోజుల కాశీ తీర్థయాత్ర.. టికెట్ ధర ఎంతంటే..!
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తీర్థయాత్రలకు వెళ్లే వారికి రెగ్యులర్ గా ప్యాకేజీలు తీసుకొస్తుంటుంది. తాజాగా కాశీ, అయోధ్య ఆలయాలను సందర్శించాలనుకునే వారి కోసం మరో ప్యాకేజీ తీసుకొచ్చింది. కాశీ తీర్థయాత్ర పేరిట ఓ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ మొత్తం తొమ్మిది రోజుల పాటు ఉంటుందని ఐఆర్సిటీసీ తెలిపింది. ఈ ప్యాకేజీలో టికెట్ ధరలు రూ.16,900 నుంచి మొదలవుతాయి. ఈ యాత్రకు సంబంధించి రైలు తమిళనాడు ప్రారంభం అవుతుంది.
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు సెప్టెంబర్ 9న తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి ప్రారంభం కానుంది. ఏపీకి చెందిన వారు గూడూరు, విజయవాడ స్టేషన్లలో ఈ రైలు ఎక్కాల్సి ఉంటుంది.
తెలంగాణ అయితే విజయవాడ వెళ్లి ఎక్కొచ్చు. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ తిరునల్వేలిలో సెప్టెంబర్ 9న ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 10 తేదీ నాటికి విజయవాడకు చేరుకుంటుంది. ఇక్కడ కాసేపు ఆగిన తర్వాత సెప్టెంబర్ 11 తేదీ మధ్యాహ్నానికి బీహార్ లోని గయకు చేరుకుంటుంది. భక్తులు వారికి కేటాయించిన హోటల్లకు వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం భోజనం తర్వాత మహాబోధి గుడికి తీసుకెళ్తారు. ఆ రోజు రాత్రి గయ హోటల్ లోనే బస చేస్తారు. సెప్టెంబర్ 12న విష్ణుపాద ఆలయంలో పితృదేవతలకు పిండ ప్రదానం, తర్పణం చేసుకునే వారు చేసుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో అక్కడి నుంచి వారణాసికి బయల్దేరుతారు.

ప్రయాణంలోనే రాత్రి భోజనం పెడతారు. రాత్రికి వారణాసికి చేరుకుని కేటాయించిన హోటళ్లలోకి వెళ్తారు. అక్కడే బస చేస్తారు. సెప్టెంబర్ 13న వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవ ఆలయాలను సందర్శించవచ్చు. మధ్యాహ్నం బస చేసిన హోటల్ లోనే భోజనం ఉంటుంది. ఆ రోజు అదే హోటల్ లో బస ఉంటుంది. సెప్టెంబర్ 14న తెల్లవారుజామునే అయోధ్యకు బయల్దేరుతారు. ప్రయాణ సమయంలోనే టిఫిన్ ఉంటుంది. మధ్యాహ్నం అయోధ్యకు చేరుకుని రామాలయానికి వెళ్తారు. ఆ రోజు రాత్రి ప్రయాగ్ రాజ్ బయల్దేరుతారు.
సెప్టెంబర్ 15న ఉదయం ప్రయాగ్‌రాజ్ చేరుకుంటారు. త్రివేణి సంగమంలో చేసి సమీపంలోని ఆలయాలకు వెళ్లొచ్చు. అ మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. అదే రోజు రాత్రికి తిరుగు ప్రయాణం మొదలువుతుంది. సెప్టెంబర్ 17న విజయవాడకు చేరుకుంటారు. సెప్టెంబర్ 18న తమిళనాడు చేరుకుంటారు. ఈ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.16,900 ఉంటుంది. ఈ టికెట్ తీసుకున్నవారికి హోటల్ లో నాన్ ఏసీ గదులు కేటాయిస్తారు. ఒక గదిలో నలుగురు లేదా ఐదుగురు ఉండాల్సి ఉంటుంది. 3ఏసీ టికెట్ ధర రూ.43,500 ఉంటంటుంది. ఈ టికెట్ తీసుకున్న వారికి హోటల్ లో నాన్ ఏసీ గదులు కేటాయిస్తారు. ఒక గదిలో ఇద్దురు లేదా ముగ్గురు ఉండొచ్చు. 2ఏసీ టికెట్ ధర రూ.43,500 గా ఉంది. ఈ టికెట్ తీసుకున్న వారికి హోటల్ లో బస చేసేందుకు ఏసీ గదులు ఇస్తారు. ఇద్దరూ లేదా ముగ్గురు గదిలో ఉండాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications