UPI Payments: గుడ్ న్యూస్.. యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్ అమలు వాయిదా..!

యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్ అమలు వాయిదా పడే అవకాశం ఉంది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం యూపీఐ లావాదేవీలపై ఎండిఆర్ అమలును జనవరి 2027కి వాయిదా వేయాలని వ్యాపార సంఘాలు, ఫిన్‌టెక్ సంస్థలు, చెల్లింపుల కంపెనీల నుంచి అభ్యర్థనలు వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో ఆధిపత్యం చెలాయించే డిజిటల్ చెల్లింపుల వేదిక అయిన యూపీఐని ఎన్‌పీసీఐ నిర్వహిస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుగుతున్నందున, రాబోయే రెండు రోజుల్లో ఎన్‌పీసీఐ ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. వేర్వేరు ఎండిఆర్ రేట్లు, విధానాలు, వాటి వర్తింపుపై గందరగోళం కారణంగా అమలుకు తాము సిద్ధంగా లేమని పరిశ్రమ వర్గాలు చెప్పడంతో పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత నెలలో యూపీఐ స్టీరింగ్ కమిటీ రూ. 2,000 పైబడిన లావాదేవీలకు యూపీఐ ఎండిఆర్‌ను 0.4 శాతం లేదా 40 బేసిస్ పాయింట్లుగా నిర్ణయించింది. ఈ ఎండిఆర్ ఛార్జీలు 2026 అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఎండిఆర్ అనేది డిజిటల్ చెల్లింపులను ప్రాసెస్ చేసినందుకు వ్యాపారులు బ్యాంకులకు చెల్లించే రుసుము. ఈ 0.4 శాతం రుసుము ప్రకారం యూపీఐ ద్వారా చేసే ప్రతి రూ. 2,000 ఖర్చుకు రూ. 8 లేదా ప్రతి రూ. 10,000 చెల్లింపునకు రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది. "పండుగ సీజన్ ముగిసే వరకు దీని అమలును వాయిదా వేయాలని పలు చెల్లింపుల పరిశ్రమ సంస్థలు, వ్యాపారులు ఎన్‌పిసిఐని కోరాయి.

UPI Payments

ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో, పండుగ అమ్మకాల సమయంలో ఎండిఆర్ వ్యాపార వ్యయాన్ని పెంచుతుందని ప్రభుత్వం కూడా భావిస్తుందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తిపై ఒత్తిడి తీసుకురావడంతో పండుగ అమ్మకాల సీజన్‌కు ముందు వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. వ్యాపారులు ఎండిఆర్ వ్యయాన్ని ఏదో ఒక రూపంలో వినియోగదారులపై మోపవచ్చనే భయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎండిఆర్ అమలు వాయిదా వేయాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా చెల్లింపులను అంగీకరించే వ్యాపారులందరికీ కేటగిరీ కోడ్‌లు ఉంటాయి. కార్డులకు దాదాపు ఒకే రకమైన రేట్లు ఉండగా, యుటిలిటీ చెల్లింపులు, రుణ చెల్లింపులు, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలతో పాటు ఇతర వాటికి యుపీఐ వేర్వేరు రేట్లను ప్రకటించింది. యూపీఐ ద్వారే చేసే చెల్లింపులలో చాలా వరకు కార్డుల ద్వారా చేయలేము. ఉదాహరణకు రుణ చెల్లింపులు లేదా క్యాపిటల్ మార్కెట్ లావాదేవీల కోసం ఆర్‌బిఐ క్రెడిట్ కార్డులను అనుమతించదు. యూపీఐ లేక ముందు ఈ లావాదేవీలలో చాలా వరకు నెట్ బ్యాంకింగ్, IMPS, NEFT లేదా RTGS ద్వారా జరిగేవి. ఈ లావాదేవీలకు ఛార్జీలు ఉన్నప్పటికీ, అవి కార్డ్ చెల్లింపుల MDR విధానాన్ని అనుసరించలేదు.

వినియోగదారులు తమ బ్రోకింగ్ ఖాతాలో డబ్బు జమ చేయడం అనేది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి జరిగే లావాదేవీ లాంటిదని, ఆ లావాదేవీల నుంచి బ్రోకింగ్ కంపెనీలు ఆదాయం సంపాదించవు కాబట్టి అవి MDR చెల్లించాల్సిన బాధ్యత వహించకూడదని వాదిస్తూ, క్యాపిటల్ మార్కెట్లు మార్కెట్ రెగ్యులేటర్‌తో ఆందోళన వ్యక్తం చేశాయి. ఆటోపే నిబంధనల కింద చేసే రుణ చెల్లింపులకు మాత్రమే రూ. 5 ఫ్లాట్ ఫీజు వర్తిస్తుంది. అయితే వినియోగదారుల ఖాతాలో తరచుగా అవసరమైన కనీస బ్యాలెన్స్ లేకపోవడం వల్ల చాలా చిన్న మొత్తాల రుణాల ఆటో-డెబిట్‌లు విఫలమవుతాయి. వినియోగదారుడు తర్వాత మాన్యువల్‌గా చెల్లింపు చేసినప్పుడు, దానిని ఆర్థిక సంస్థ చెల్లింపుగా పరిగణిస్తారు, దీనికి 0.4 శాతం MDR వర్తిస్తుంది. బ్యాంకు లేదా NBFCకి చేసే రుణ చెల్లింపును, సాధారణ ఆర్థిక సేవల లావాదేవీ నుంచి ఎలా వేరు చేయాలనే దానిపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎండీఆర్ అమలును వాయిదా వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+