UPI Payments: యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్ ఛార్జీలు ఇక లేనట్లేనా..!
ఇండియాలో యూపీఐ చెల్లింపులు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) వేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం సెప్టెంబర్ లోనే అమలు కావాల్సి ఉన్నా.. వ్యాపారులు, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో దీపావళి తర్వాత అమలు చేస్తామని ప్రకటించారు. అయితే యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. యూపీఐ వాడకం దేశంలో భారీగా పెరిగింది. చిన్న దుకాణం నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. దీపావళి సందర్బంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారీగా జరిగినట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఎండీఆర్ ఛార్జీలు వేస్తే.. వ్యాపారులు ఆ ఛార్జీలు భరించకుండా వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. దీంతో యూపీఐ పేమెంట్లు వాడుతున్నవారు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఈ ఛార్జీల వసూలు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం అంటే 2027లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అక్కడ బీజేపీకి వ్యతిరేకత గెలవాలంటే.. ఈ నిర్ణయాన్ని వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. 2027 ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవ, మణిపూర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. యూపీఐ పై ఎండీ ఛార్జీలు మొదలు పెడితే అక్కడ ఉన్న వ్యాపారులు వ్యతిరేకించే అవకాశం ఉంది.

అలాగే ప్రజలు కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది. అందుకే యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ వసూలు అనేది లేటు అయ్యే అవకాశం ఉంది. 2 వేల పైన వ్యాపారులకు చేసే యూపీఐ చెల్లింపుల పైనే ఎండీఆర్ వేయనున్నారు. అయితే క్రమంగా ఇది పర్సన్ టూ పర్సన్ కూడా వర్తింపజేసే ప్రయత్నం చేస్తారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే ఛార్జీలపై ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వ్యాపారులకు చేసే రూ.2000 యూపీఐ చెల్లింపులపై MDR ఉండదు.
ఒక వ్యక్తి మరో వ్యక్తికి చేసే యూపీఐ చెల్లింపులపై కూడా ఛార్జీ ఉండు. నెలకు రూ.లక్ష వరకు UPI QR కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు మినహాయింపు ఉంది. ఎండీఆర్ ఛార్జీలను ప్రధానంగా వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. తమపై అదనపు ఆర్థిక భారం పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications