Mutual Fund: అత్యధిక రాబడి అందిస్తోన్న ఇండెక్స్ ఫండ్లు ఇవే..!
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం రిస్క్ తో కూడుకున్న పని. అయితే ఫండ్లను బట్టి రిస్క్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇండెక్స్ ఫండ్లలో రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది. అయితే ఇండెక్స్ ఫండ్లు కూడా మంచి రాబడి ఇచ్చాయి. గత ఆరు నెలల కాలంలో మంచి రాబడి ఇచ్చిన ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లలో ఐసీఐసీఐ ప్రు నాస్ డాక్ 100 ఇండెక్స్ ఫండ్ అగ్ర స్థానంలో ఉంది. ఈ ఫండ్ గత ఆరు నెలల్లో 27.3 శాతం రాబడిని అందించింది. ఆగస్టు 14 నాటి ACE MF డేటా ప్రకారం మోతిలాల్ ఓస్వాల్ S&P 500 ఇండెక్స్ ఫండ్ 19.7 శాతం, మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ మైక్రోక్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ 18.9 శాతం రాబడి ఇచ్చింది.
దీని కోసం కనీసం రూ. 1,500 కోట్ల నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) కలిగిన పథకాలను మాత్రమే ఈ ర్యాంకింగ్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ప్రమాణానికి అనుగుణంగా ఉన్న మొదటి ఐదు ఫండ్లలో మోతిలాల్ ఓస్వాల్ S&P 500 ఇండెక్స్ ఫండ్ అత్యధికంగా రూ. 4,499.9 కోట్ల నిధులను కలిగి ఉంది. బెంచ్ మార్క్ రాబడి విషయానికొస్తే ఒక సంవత్సరం కాలంలో బెంచ్‌మార్క్ 26.1% రాబడిని ఇవ్వగా ఐసీఐసీఐ ప్రు నాస్ డాక్ 100 ఇండెక్స్ ఫండ్ తన బెంచ్‌మార్క్ కంటే 10.6 శాతం పాయింట్లు అధిక రాబడి ఇచ్చింది. అలాగే మూడేళ్ల కాలంలో బెంచ్‌మార్క్ 25.5% రాబడిని ఇవ్వగా, ఈ ఫండ్ తన బెంచ్‌మార్క్ కంటే 5.4 శాతం పాయింట్లు ముందుంది.

ఒక నెల రాబడికి సంబంధించిన మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టి 250 ఇండెక్స్ ఫండ్ 3.5 శాతం రాబడితో జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. మూడు నెలల కాలపరిమితిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు మరొక ఫండ్ అగ్రస్థానంలో ఉంది. మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ మైక్రోక్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ 12.9 శాతం రాబడి ఇచ్చింది. మూడేళ్ల రాబడి విషయంలోనూ ఇదే పథకం ముందు వరుసలో ఉంది. ఈ కాలంలో ఐసీఐసీఐ ప్రు నాస్ డాక్ 100 ఇండెక్స్ ఫండ్ 30.9 శాతం రాబడిని అందించింది.ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఒక నిర్దిష్ట ఇండెక్స్‌ను అనుకరించడం లేదా ట్రాక్ చేస్తాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications