Saudi Arabia: సౌదీ అరేబియాపై హౌతీల దాడులు.. ముడి చమురు ధర ఇంకా పెరగనుందా..!
శనివారం యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై భారీ స్థాయిలో దాడి చేయడంతో రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో కొన్ని విమానాలు ఆలస్యమయ్యాయి. రియాద్‌లోని "సున్నితమైన లక్ష్యాలను" యాన్బులోని సౌదీ అరామ్కో కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు హౌతీలు తెలిపారు. ఈ దాడులలో బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించినట్లు హౌతీలు ప్రకటించుకున్నారు. రియాద్‌ను లక్ష్యంగా చేసుకున్న హౌతీ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకుని, ధ్వంసం చేసినట్లు సౌదీ వైమానిక రక్షణ దళాలు తెలిపాయి.
రెండవ పేలుడు తర్వాత కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మంటలు చెలరేగినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సౌదీ అధికారులు అంతకుముందు రియాద్‌కు వైమానిక ముప్పు హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత ప్రమాదం తొలగిపోయిందని వారు ప్రకటించారు. హౌతీలతో ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి సౌదీ రాజధానికి జారీ చేసిన మొట్టమొదటి హెచ్చరిక ఇదేనని తెలుస్తోంది. విమానాశ్రయంలోని ఇంధన నిల్వ మౌలిక సదుపాయాలను హౌతీలు లక్ష్యంగా చేసుకోవడంతో భారీ మంటలు చెలరేగినట్లు సమాచారం. రియాద్‌లో ప్రాణనష్టం లేదా పెద్ద నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

తమ గ్రూపు రెండు ప్రధాన ఆపరేషన్లను ప్రారంభించిందని హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరియా తెలిపారు. మొదటిది రియాద్‌లోని సున్నితమైన లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపారు. రెండోది ఎర్ర సముద్ర తీరంలోని ఒక ప్రధాన పారిశ్రామిక, ఇంధన కేంద్రమైన యాన్బులో, సౌదీ చమురు దిగ్గజం అరామ్కోకు చెందిన ఒక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు. లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాలలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని ఆయన పేర్కొన్నారు. దాడులను అడ్డుకున్నామని సౌదీ అరేబియా చెబుతోంది. రియాద్‌ను లక్ష్యంగా చేసుకున్న క్షిపణిని తమ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి తెలిపింది.
బైష్, తైఫ్, ఫరాసన్, యాన్బులపై జరిగిన దాడులను కూడా అడ్డుకున్నట్లు అది పేర్కొంది. ఈ దాడులు పౌరులు, పౌర వస్తువులను లక్ష్యంగా చేసుకున్నాయని సంకీర్ణ కూటమి ప్రతినిధి తుర్కీ అల్-మాలికీ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని దాడులను నిరోధించడానికి సౌదీ అరేబియా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నామన్న ఆరోపణలను హౌతీలు ఖండించారు. యెమెన్‌లోని హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై సౌదీ వైమానిక దాడులు పెరగడానికి ప్రతిస్పందనగా ఈ దాడులు జరిగాయని సరియా అన్నారు. సౌదీ వైమానిక దాడులు ఆగి, యెమెన్‌పై ఆంక్షలు ఎత్తివేసే వరకు పరిస్థితి ఇలానే ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
