గత సంవత్సరంలో ఫార్మా, హెల్త్‌కేర్ మ్యూచువల్ ఫండ్‌లు అద్భుతమైన పనితీరును కనబరిచాయి. 10 ఫండ్స్ 20 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించాయి. అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఫండ్స్ 25 శాతం దాటగా ఈ విభాగంలోని అత్యుత్తమ, అత్యంత అధ్వాన్న పనితీరు కనబరిచిన ఫండ్‌ల మధ్య అంతరం గణనీయంగా ఉంది. ఒక సంవత్సరంలో హెచ్ డీఎఫ్సీ ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్ 28.66 శాతం రాబడి ఇచ్చి అగ్రస్థానంలో నిలిచింది. కోటక్ హెల్త్‌కేర్ ఫండ్ 28.47 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. టాప్ 10 ఫండ్‌లలో HDFC ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్, కోటక్ హెల్త్‌కేర్ ఫండ్ల తర్వాత పీజీఐఎం ఇండియా హెల్త్‌కేర్ ఫండ్ 27.17 శాతం రాబడి ఇచ్చింది.
క్వాంట్ హెల్త్‌కేర్ ఫండ్ 25.64 శాతం రాబడి అందించగా.. బజాజ్ ఫిన్‌సర్వ్ హెల్త్‌కేర్ ఫండ్ 25.28% రాబడిని ఇచ్చింది. వైట్‌ఓక్ క్యాపిటల్ ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్ కూడా 24 శాతం రాబడి ఇవ్వగా..ఎస్‌బీఐ హెల్త్‌కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ 23.03 శాతం, మిరే అసెట్ హెల్త్‌కేర్ ఫండ్ 22.39% రాబడిని అందించింది. 20 శాతం రాబడి దాటిన చివరి రెండు పథకాల్లో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫార్మా & హెల్త్‌కేర్ ఫండ్ 20.18 శాతం, యూటీఐ హెల్త్‌కేర్ ఫండ్ 20.05 శాతంగా ఉన్నాయి. ఎల్ఐసి ఎంఎఫ్ హెల్త్‌కేర్ ఫండ్ 19.70 శాతం రాబడి ఇచ్చింది. డీఎస్పీ హెల్త్‌కేర్ ఫండ్ 19.25 శాతం రాబడి అందించింది. ఆస్తుల పరంగా అతిపెద్ద ఫండ్‌లు ఇదే కాలంలో మిశ్రమ పనితీరును కనబరిచాయి.
ఈ జాబితాలో రూ.9,279 కోట్ల నికర ఆస్తులతో అతిపెద్ద పథకమైన నిప్పన్ ఇండియా ఫార్మా ఫండ్ ఒక సంవత్సరంలో 14.06 శాతం రాబడిని అందించింది. రూ.6,803 కోట్ల ఆస్తులు కలిగిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ హెల్త్‌కేర్ ఫండ్, 10.94 శాతం రాబడిని అందించింది. అతిపెద్ద ఫండ్లలో ఎస్‌బిఐ హెల్త్‌కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ ఒక ముఖ్యమైన మినహాయింపుగా నిలిచింది. ఇది రూ.5,400 కోట్ల నికర ఆస్తులపై 23.03 శాతం రాబడిని అందించింది. రూ.3,442 కోట్ల ఆస్తులున్న మిరే అసెట్ హెల్త్‌కేర్ ఫండ్ 22.39% రాబడిని ఇవ్వగా, రూ.3,639 కోట్ల ఆస్తులున్న డిఎస్‌పి హెల్త్‌కేర్ ఫండ్ 19.25% రాబడిని ఇచ్చింది.
గత సంవత్సరంలో ఆస్తుల పరంగా అతిపెద్ద ఫండ్‌లు భారీగా రిటర్న్స్ ఇవ్వలేదు. ఈ వ్యత్యాసం ముఖ్యంగా నిప్పన్ ఇండియా ఫార్మా ఫండ్,ప్రుడెన్షియల్ హెల్త్‌కేర్ ఫండ్, ప్రముఖ పథకాల మధ్య స్పష్టంగా కనిపిస్తుంది. నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్ రాబడి 14.06 శాతం కాగా, హెచ్‌డిఎఫ్‌సి ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్ రాబడి 28.66 శాతంగా ఉంది. అంటే వీటి మధ్య 14 శాతం పాయింట్లకు పైగా అంతరం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
Share This Article
English summary
Best Pharma And Health Care Mutual Funds: సంవత్సరంలో 28 శాతం రాబడి ఇచ్చిన ఫండ్ ఇదే..! | The HDFC Pharma and Healthcare Fund delivered a return of 28.66 percent over one year
గత సంవత్సరంలో ఫార్మా, హెల్త్‌కేర్ మ్యూచువల్ ఫండ్‌లు అద్భుతమైన పనితీరును కనబరిచాయి. 10 ఫండ్స్ 20 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించాయి. అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఫండ్స్ 25 శాతం దాటగా ఈ విభాగంలోని అత్యుత్తమ, అత్యంత అధ్వాన్న పనితీరు కనబరిచిన ఫండ్‌ల మధ్య అంతరం గణనీయంగా ఉంది. ఒక సంవత్సరంలో హెచ్ డీఎఫ్సీ ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్ 28.66 శాతం రాబడి ఇచ్చి అగ్రస్థానంలో నిలిచింది. కోటక్ హెల్త్‌కేర్ ఫండ్ 28.47 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. టాప్ 10 ఫండ్‌లలో HDFC ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్, కోటక్ హెల్త్‌కేర్ ఫండ్ల తర్వాత పీజీఐఎం ఇండియా హెల్త్‌కేర్ ఫండ్ 27.17 శాతం రాబడి ఇచ్చింది.క్వాంట్ హెల్త్‌కేర్ ఫండ్ 25.64 శాతం రాబడి అందించగా.. బజాజ్ ఫిన్‌సర్వ్ హెల్త్‌కేర్ ఫండ్ 25.28% రాబడిని ఇచ్చింది. వైట్‌ఓక్ క్యాపిటల్ ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్ కూడా 24 శాతం రాబడి ఇవ్వగా..ఎస్‌బీఐ హెల్త్‌కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ 23.03 శాతం, మిరే అసెట్ హెల్త్‌కేర్ ఫండ్ 22.39% రాబడిని అందించింది. 20 శాతం రాబడి దాటిన చివరి రెండు పథకాల్లో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫార్మా & హెల్త్‌కేర్ ఫండ్ 20.18 శాతం, యూటీఐ హెల్త్‌కేర్ ఫండ్ 20.05 శాతంగా ఉన్నాయి. ఎల్ఐసి ఎంఎఫ్ హెల్త్‌కేర్ ఫండ్ 19.70 శాతం రాబడి ఇచ్చింది. డీఎస్పీ హెల్త్‌కేర్ ఫండ్ 19.25 శాతం రాబడి అందించింది. ఆస్తుల పరంగా అతిపెద్ద ఫండ్‌లు ఇదే కాలంలో మిశ్రమ పనితీరును కనబరిచాయి. ఈ జాబితాలో రూ.9,279 కోట్ల నికర ఆస్తులతో అతిపెద్ద పథకమైన నిప్పన్ ఇండియా ఫార్మా ఫండ్ ఒక సంవత్సరంలో 14.06 శాతం రాబడిని అందించింది. రూ.6,803 కోట్ల ఆస్తులు కలిగిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ హెల్త్‌కేర్ ఫండ్, 10.94 శాతం రాబడిని అందించింది. అతిపెద్ద ఫండ్లలో ఎస్‌బిఐ హెల్త్‌కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ ఒక ముఖ్యమైన మినహాయింపుగా నిలిచింది. ఇది రూ.5,400 కోట్ల నికర ఆస్తులపై 23.03 శాతం రాబడిని అందించింది. రూ.3,442 కోట్ల ఆస్తులున్న మిరే అసెట్ హెల్త్‌కేర్ ఫండ్ 22.39% రాబడిని ఇవ్వగా, రూ.3,639 కోట్ల ఆస్తులున్న డిఎస్‌పి హెల్త్‌కేర్ ఫండ్ 19.25% రాబడిని ఇచ్చింది.గత సంవత్సరంలో ఆస్తుల పరంగా అతిపెద్ద ఫండ్‌లు భారీగా రిటర్న్స్ ఇవ్వలేదు. ఈ వ్యత్యాసం ముఖ్యంగా నిప్పన్ ఇండియా ఫార్మా ఫండ్,ప్రుడెన్షియల్ హెల్త్‌కేర్ ఫండ్, ప్రముఖ పథకాల మధ్య స్పష్టంగా కనిపిస్తుంది. నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్ రాబడి 14.06 శాతం కాగా, హెచ్‌డిఎఫ్‌సి ఫార్మా అండ్ హెల్త్‌కేర్ ఫండ్ రాబడి 28.66 శాతంగా ఉంది. అంటే వీటి మధ్య 14 శాతం పాయింట్లకు పైగా అంతరం ఉంది. డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
Story first published: Sunday, September 6, 2026, 17:44 [IST]
Other articles published on
Sep 6, 2026