Groww: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుడికి షాకిచ్చిన గ్రో.. రూ.12,70,404 పోర్ట్‌ఫోలియోను రూ.82,441 తగ్గించింది..!

మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టేవారు భద్రత కూడిన డీమాట్ ఖాతా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే వారి డబ్బులు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. తాజాగా గ్రో బ్రోకింగ్ చేసిన తప్పు వల్ల ఓ పెట్టుబడిదారుడు భారీగా నష్టపోయారు. అయితే పెట్టుదారు సెబీ, వినియోగదారులకు ఫిర్యాదు చేయడంతో న్యాయం జరిగింది. రంజనా ప్రియ అనే మహిళ 'Groww' యాప్ ద్వారా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల (SIPs)లో రూ.8,12,160 పెట్టుబడి పెట్టారు. నవంబర్ 26, 2025 నాటికి ఆమె పోర్ట్‌ఫోలియో విలువ రూ.12,70,404కి పెరిగింది. వ్యక్తిగత, ఆర్థిక అవసరాల నిమిత్తం, ఆమె తన పెట్టుబడుల నుంచి రూ.10 లక్షలను విత్‌డ్రా (redeem) చేయడానికి యాప్ ద్వారా డిజిటల్ అభ్యర్థన చేశారు.

అయితే ఆ అభ్యర్థన తర్వాత యాప్ డాష్‌బోర్డ్‌లో ఆమె మొత్తం పెట్టుబడి విలువ రూ.12,70,404కి బదులుగా కేవలం రూ.84,508గా కనిపించింది. దీంతో ఆమె షాక్ కు గురైంది. ఆమె గ్రో కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించారు. మెయిల్స్ కూడా చేశారు. అంతేకాకుండా నవంబర్ 27, 2025న సెబీ (SEBI)కి కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆమె న్యాయం జరగలేదు. నవంబర్ 30, 2025న ఆమె బ్యాంక్ ఖాతాలో రూ.15,500 జమ అయ్యాయి. కానీ, ఆ ప్లాట్‌ఫారమ్ ఈ లోపాన్ని సరిదిద్దలేదు లేదా మిగిలిన మొత్తాన్ని చెల్లించలేదు. పోర్ట్‌ఫోలియో విలువ ₹12,70,404గా ఉండగా.. మొత్తం రూ.82,441గా చూపించింది.

Groww

మిగిలిన రూ.11,85,895 మేర పెట్టుబడికి ఎటువంటి లెక్కా పత్రం లేకుండా పోయిందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఇ-జాగృతి వేదిక ద్వారా కూడా తన ఫిర్యాదులను తెలియజేశారు. 2025 డిసెంబర్ 7 నుండి 25 డిసెంబర్ మధ్య వాట్సాప్ ద్వారా నాలుగు సార్లు ఫాలో అప్ చేశారు. ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ, గ్రోవ్ సంస్థ రికార్డులను సరిదిద్దలేదని లేదా బ్యాలెన్స్‌ను వాపసు చేయలేదని ఆమె అన్నారు. ఆ తర్వాత ప్రియ 2026 ఏప్రిల్ 22న ఒక వినియోగదారుల ఫిర్యాదును దాఖలు చేశారు. న్ 18 శాతం వార్షిక వడ్డీతో పాటు రూ.11,85,896 వాపసు, మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులకు పరిహారంగా రూ.50 లక్షలు, వ్యాజ్య ఖర్చుల కోసం ₹50,000 చెల్లించాలని ఆమె కోరారు.

2026 అక్టోబర్ 14 నాటి తన ఉత్తర్వులో గ్రోవ్ ఇన్వెస్ట్ టెక్ మరియు నెక్స్ట్‌బిలియన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (గ్రోవ్)/బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ న్యాయవాది ద్వారా హాజరయ్యాయని, కానీ నిర్దేశించిన 45 రోజుల వ్యవధిలోగా లిఖితపూర్వక సమాధానాలు దాఖలు చేయలేదని కమిషన్ పేర్కొంది. అందువల్ల, ఆ కంపెనీల నుంచి ఎలాంటి ప్రతివాదనలు లేకుండానే ప్రియ సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుంది. రిడెంప్షన్ తేదీ నుంచి అసలు చెల్లింపు జరిగే వరకు 6 సాతం వార్షిక వడ్డీతో పాటు రూ.11,85,896 తిరిగి చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. సేవా లోపం, మానసిక వేధింపులకు పరిహారంగా రూ.10,000 చెల్లించాలని స్పష్టం చేసింది. వ్యాజ్య ఖర్చుల కోసం రు.2,000 చెల్లించాలని పేర్కొంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+