Smart Ration Cards: ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పింది. ప్రజలకు త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు కొత్త పీడీఎస్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. ఆ తరువాత రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ నిర్వహిస్తామని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.
ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్నవారికే స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి కూడా రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ తేదీ ఫిక్స్ కావడంతో అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందేలా తుది లబ్ధిదారుల జాబితాల ధృవీకరణను (e-KYC) త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేసింది. స్మార్ట్ రేషన్ కార్డుల ప్రిటింగ్ నుంచి జిల్లాలకు చేరే వరకు సురక్షితమైన రవాణా నిర్వహణపై పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా దాదాపు 1.05కోట్ల కుటుంబాలకు లామినేటెడ్ (పీవీసీ) రూపంలో రూపొందించిన కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డు వాటర్‌ప్రూఫ్ సౌకర్యంతో, క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉంటుంది. ఈ స్మార్ట్ కార్డుల్లో క్యూఆర్ కోడ్‌తో పాటు ఆధునిక భద్రతా ఫీచర్లను కూడా పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పూర్తైన అనంతరం జిల్లా వారీగా సమగ్ర నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఉన్నతాధికారులను ఆదేశించారు.
కాగా ప్రస్తుతం రేషన్ కార్డు దారులకు మూడు నెలల బియ్యం ఇస్తున్నారు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించి బియ్యం ఇస్తున్నారు. ఆగస్ట్ 31 వరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications